నటి నుంచి రాజకీయనాయకురాలిగా టర్న్ అయిన రోజా...ఆ తర్వాత సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఆమె పొలిటికల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉంటున్నారు. అయితే జబర్దస్ధ్ షో ను మాత్రం వదలకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమెను తన సినిమాలో ఒప్పించటానికి బోయపాటి శ్రీను ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో రూపొందనున్న ప్రతిష్టాత్మక చిత్రంలో రోజా కోసం ఓ పాత్రను డిజైన్ చేసారట. నెగిటివ్ గా కనిపించే పాజిటివ్ పాత్ర అదని, ఇంట్రవెల్ వద్ద రివీల్ అయ్యే ఈ క్యారక్టర్ సెకండాఫ్ అంతటా ఉంటుందని సమాచారం. అయితే ఈ పాత్ర రోజా అయితేనే న్యాయం చేయగలదని భావించి బోయపాటి ఆమెను ఒప్పించే పనిలో పడ్డారట. 

అయితే ఆ పాత్ర రాజకీయాలను టచ్ చేస్తుందని , అందుకే రోజా ఒప్పుకోవటం లేదని, వాటిని తీసేస్తే ఏమన్నా కమిట్ అవుతుందేమో అంటున్నారు.  నగరి అసెంబ్లీ నియోజక వర్గానికి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకురాలి పాత్ర తెరపై చేస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పొలిటికల్ కెరీర్ పై ఉంటుందని భావిస్తున్నారు.ఇక బాలయ్య కూడా హిందూపూర్ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య...  కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో సి.కళ్యాణ్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో వాళ్ళ కాంబినేషన్‌లో  రూపొందిన జైసింహా సంక్రాంతి కానుకగా వచ్చి హిట్ అయ్యింది. అందుకే ఆ కాంబో మళ్ళీ ఈసారి రిపీట్ అవుతోందంటే బిజినెస్ వర్గాల్లో ఆసక్తి కలుగుతోంది. అలాగే ఈ చిత్రం  ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఆ సినిమా కోసం విదేశాల్లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ తీశారు .  రూలర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ  సినిమాలో బాలయ్య లుక్ కూడా కొత్తగా ఉంది.