డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ అయిన రియా చక్రవర్తి 14రోజుల జ్యూడిషియల్ కస్టడీకి తరలించడం జరిగింది. ఆమెను బైకుల్లాలో గల ఒక జైలు నందు వుంచడం జరిగింది. కాగా రియా చక్రవర్తిని ఉంచిన గదిలో కనీస సౌకర్యాలు కూడా లేవని సమాచారం. రియా ఉన్న గదిలో సీలింగ్ ఫ్యాన్ కూడా లేదట. అలాగే పడుకోవడానికి చాప మాత్రం ఉందట. మంచం, దిండు కూడా ఆమెకు ఇవ్వడం లేదట. కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆమెకు ఒక టేబుల్ ఫ్యాన్ ప్రొవైడ్ చేయనున్నట్లు జైలు అధికారులు చెప్పారట. 

బైకుల్లా జైలులో కరోనా కేసులు కూడా అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో రియా చాలా భయపడుతున్నారట. ఇక రియా భద్రత కోసం మూడు షిఫ్ట్ లలో ఆరుగురు కానిస్టేబుల్స్ డ్యూటీ చేస్తున్నారట. మొన్నటి వరకు లగ్జరీ లైఫ్ అనుభవించిన రియా పరిస్థితి ఇంత దుర్భరంగా మారడం ఆమె అభిమానులను ఆవేదనకు గురి చేస్తుంది. అరెస్ట్ అయిన వెంటనే రియా బెయిల్ కోసం అప్లై చేసుకోగా కోర్టు తిరస్కరించింది. 

బెయిల్ దొరకని నేపథ్యంలో ఆమె మరో కొన్ని రోజులు అదే జైలులో ఉండాల్సి ఉంటుంది. రియా చక్రవర్తికి డ్రగ్ సప్లయర్స్ తో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు దొరకడం జరిగింది. దీనితో రియాను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదట రియా బ్రదర్ షోవిక్ అరెస్ట్ కాగా, రెండు రోజుల క్రితం రియా కూడా అరెస్ట్ కావడం జరిగింది.