సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను నారోటిక్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా రెగ్యులర్‌గా ఈడీ, ఎన్సీబీ అధికారుల విచారణకు హాజరవుతోంది రియా చక్రవర్తి. ఈ నేపథ్యంలో ఆమె టీ షర్ట్ మీద ఉన్న కోటేషన్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. తనను కావాలనే కొంత మంది టార్గెట్ చేస్తూ వేదిస్తున్నారన్న భావన కలిగే ఉంది ఆ కోట్‌.

నారోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో ఆఫీస్‌లో అధికారుల విచారణకు వరుసగా మూడో రోజు హాజరైన సమయంలో ఆమె ఇంట్రస్టింగ్ కోట్ ఉన్న టీ షర్ట్‌ను ధరించింది. బ్లాక్ టీ షర్ట్ మీద `రోసెస్‌ ఆర్‌ రెడ్‌, వైలెట్స్‌ ఆర్‌ బ్లూ. లెట్స్‌ స్మాష్ ద పాట్రియార్కి, మీ అండ్‌ యూ` (మనమంతా కలిసి పితృ స్వామ్యాన్ని బద్దలు కొడదాం) అంటూ ఉన్న కొటేషన్‌తో కెమెరాల కంట పడింది రియా. దీంతో ఒక్కసారిగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఏడాది జూన్‌ 14న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన మృతిపై అనేక అనుమానాలు రావటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముందుగా ఇండస్ట్రీలోని నెపోటిజం కారణంగానే సుశాంత్‌ మరణించి ఉంటాడని భావించినా.. ఇప్పుడు కేసు మొత్తం రియా మెడకు చుట్టుకుంది.