సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కొటిక్స కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారిస్తోంది. ఈ సందర్భంగా రియా పలు ఆసక్తికర, సంచలన విషయాలను వెల్లడిస్తోంది. రెండు రోజుల క్రితం డ్రగ్స్ తీసుకునే 25 మంది సెలబ్రిటీల పేర్లని వెల్లడించింది. అందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, సైమోన్‌ పేర్లు బయటకు వచ్చాయి. 

14 రోజులు రిమాండ్‌లో ఉన్న రియా తాజాగా మరిన్ని కొత్త విషయాలను వెల్లడించింది. బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ ఫిల్మ్ మేకర్‌ సుశాంత్‌కి డ్రగ్స్ తీసుకోవడం నేర్పించాడట. ఆయన రెగ్యులర్‌గా డ్రగ్స్ పార్టీలకు తీసుకెళ్తుండేవాడని తెలిపింది. ఈ విషయం తనకు సుశాంత్‌ చెప్పాడని రియా తెలిపింది. 

అంతేకాదు సుశాంత్‌కు చెందిన లోనాల్వా ఫామ్‌ హౌజ్‌లో బీ టౌన్‌కి చెందిన అతని స్నేహితులు డ్రగ్ పార్టీలు చేసుకునే వారని తెలిపింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు రియా చెప్పిన ఫిల్మ్ మేకర్ పై నిఘా పెంచినట్టు తెలుస్తుంది. డ్రగ్స్ కేసులో చాలా మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.