Asianet News TeluguAsianet News Telugu

అరవింద్ 'ఆహా' ని టార్గెట్ చేస్తూ వర్మ కామెంట్స్

ఆర్జీవీ వరల్డ్ పేరుతో రానున్న ఈ యాప్ లో ఆడియన్స్ ఏం కావాలన్నా దొరుకుతుందిట. అయితే ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కాదట..అడల్డ్ ఆడియన్స్ కోసమే అని చెప్తున్నారు. ఇండైరక్ట్ గా అల్లు అరవింద్ ఆహా పై సెటైర్స్ వేసారు. లాక్ డౌన్ రిలాక్సేషన్ పీరియడ్ లో ఆయన ఓ టీవి ఛానెల్ కు ఇంటర్వూ ఇచ్చారు. ఇందులో ఆహా ఓటీటిని పేరు చెప్పకుండా ఫన్ చేసారు. వ్యంగ్యంగా ఆహా పై కౌంటర్స్ వేసారు. 

RGV Takes Dig at Allu Aravind  OTT indrectly?
Author
Hyderabad, First Published May 19, 2020, 3:28 PM IST


రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన సొంత యాప్ ని మార్కెట్ లోకి తెస్తున్నారు. ఆర్జీవీ వరల్డ్ పేరుతో రానున్న ఈ యాప్ లో ఆడియన్స్ ఏం కావాలన్నా దొరుకుతుందిట. అయితే ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కాదట..అడల్డ్ ఆడియన్స్ కోసమే అని చెప్తున్నారు. ఇండైరక్ట్ గా అల్లు అరవింద్ ఆహా పై సెటైర్స్ వేసారు. లాక్ డౌన్ రిలాక్సేషన్ పీరియడ్ లో ఆయన ఓ టీవి ఛానెల్ కు ఇంటర్వూ ఇచ్చారు. ఇందులో ఆహా ఓటీటిని పేరు చెప్పకుండా ఫన్ చేసారు. వ్యంగ్యంగా ఆహా పై కౌంటర్స్ వేసారు. 

ఆహా కంటెంట్ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని, అయితే ఒక వర్గాన్నే టార్గెట్ చేస్తే ఫలితం ఉంటుందనే భావన వ్యక్తం చేసారాయన. అలాగే ప్రస్తుతం ఓటీటి ప్లాట్ ఫామ్ ల అవసరం చాలా ఉందని, భవిష్యత్ లో ఆహా అనిపించగలిగే కంటెంట్ ఉన్న ఓటీటిలే నిలబడతాయని ఇండైరక్ట్ గా ఆహాలో సరైన కంటెంట్ లేదని దెప్పి పొడిచారు. అయితే ఆర్జీవి వరల్డ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలంటున్నారు సినీ అభిమానులు. 

గతంలో అదే మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST) సినిమా తీసి అట్రాక్ట్ చేసిన వర్మ.. ఈ సారి 'క్లైమాక్' సినిమాతో రంగంలోకి దిగుతున్నారు. పోర్న్ స్టార్ మియాను ఈ సారి కూడా వాడుతూ కరోనా వేళ తన మార్క్ మసాలా చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లింగ్ కథాంశానికి శృంగార సన్నివేశాలు, నగ్న దృశ్యాలు జోడించి ఈ 'క్లైమాక్' రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ అట్టి విషయాన్ని స్పష్టం చేశాయి.

 ఈ క్రమంలోనే ఈ మూవీ రీలీజ్ డేట్ తెలుపుతూ మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ.మే 29వ తేదీన తన 'క్లైమాక్' మీ ముందుకు రాబోతోందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దేవుడు కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చినా 'క్లైమాక్' సినిమాను ఆపలేదని తెలుపుతూ ట్వీట్ పెట్టారు. మే 29వ ఉదయం 11 గంటలకు 1 గంటలకి #RGVWorldTheatre @shreyaset యాప్‌లో బొమ్మ పడుతుందని పేర్కొన్నారు.

ఇక ఈ ఓటీటీలు సినిమాలతో పోలిస్తే...  చాలా చీపు.. పాప్కార్న్, కోక్ కొన్నుకోవాల్సిన అవసరముండదు అని చెబుతూ కాలం మారుతున్న తీరును తనదైన కోణంలో వర్ణించారు. బ్లాక్ & వైట్ సినిమాల పైకి కలర్ సినిమాలొచ్చి పడినట్టు ఇప్పుడు థియేటర్ల పైకి ఇంటి టెక్నాలజీలొచ్చి పడ్డాయని వర్మ తెలిపారు. మారుతున్న టెక్నాలజీతో పాటు తనూ మారకపోతే ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ మట్టిలో కలిసిపోతుందని  కామెంట్ చేశారు వర్మ.
 

Follow Us:
Download App:
  • android
  • ios