Asianet News TeluguAsianet News Telugu

వర్మ క్వాలిఫికేషన్‌ ఏంటో తెలుసా?.. 37ఏళ్ల తర్వాత పట్టా పొందిన ఆర్జీవీ..

వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఏం చదువుకున్నాడో తెలుసా? మార్నింగ్‌ లేవగానే పోర్న్ వీడియోలు చూసే వర్మ.. ఎడ్యూకేషన్‌ క్వాలిఫికేషన్‌ ఇప్పుడు రివీల్‌ అయ్యింది.

rgv received certificate after 37 years do you know his education qualification ?
Author
First Published Mar 16, 2023, 5:12 PM IST

వివాదాస్పద,సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సమాజానికి భిన్నంగా స్పందిస్తూ హాట్‌ టాపిక్‌ అవుతుంటారు. రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలపై సెటైర్లు పేలుస్తూ రచ్చ చేస్తుంటారు. అనేక విమర్శల పాలవుతుంటాడు. దీనికితోడు యంగ్‌ హీరోయిన్లతో రొమాన్స్ తో మరింత హాట్‌ టాపిక్ అవుతుంటాడు వర్మ. ఉదయం లేవడంతోనే పోర్న్ వీడియోలు చూసే వర్మ.. ఎడ్యూకేషన్‌ క్వాలిపికేషన్‌ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. 

ఆర్జీవీ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అది కూడా 37ఏళ్ల తర్వాత కావడం గమనార్హం. తాజాగా బుధవారం ఆయన విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ ఎగ్జిబిషన్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు ఇందులోనే ఆయన ఇంజనీరింగ్‌ సర్టిఫికేట్‌ అందుకున్నారు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్‌ని ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేశాడు వర్మ. 37ఏళ్ల తర్వాత బిటెక్‌ పాస్‌ అయిన డిగ్రీని పొందడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మరో ట్వీట్‌లో వర్మ చెబుతూ, బాగా చదువుకున్న ప్రొఫేసర్ల మధ్య చదువుకోని నేను అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతున్న ఫోటోని పంచుకుంటూ, వాళ్లని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే నన్నే వాళ్లు చెడగొట్టారు అని పేర్కొన్నారు వర్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ వివాదాస్పద కామెంట్లు చేశారు.నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటూ వ్యాఖ్యానించారు. చనిపోయాక స్వర్గానికి వెళ్తే రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చని.. కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయాలంటూ కామెంట్ చేశారు ఆర్జీవీ. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలని.. స్త్రీ జాతికి తానే దిక్కవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు.  నాలుగున్నర లక్షల ధారావి ప్రజలు ఒకవైపు.. కత్రినా కాళ్లు ఒకవైపుంటే కత్రినా కాళ్లకే తన ఓటని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. పశువులకు వున్న స్వేచ్ఛ మనుషులకు లేదని ఆయన పేర్కొన్నారు. తాను యానిమల్ లవర్‌ని కాదని.. అందమైన అమ్మాయిల జాతిని మాత్రమే ప్రేమిస్తానని రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios