వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువు. ఎన్ని వివాదాలు ఎదురైనా తాను చేయాలనుకున్నది చేసి తీరుతాడు. అలా ఏడాది క్రితం వర్మ దర్శకత్వంలో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంపై అప్పట్లో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. వర్మపై కేసు కూడా నమోదైంది. 

ఈ చిత్రంలో అశ్లీల చిత్రాల తార మియా మాల్కోవా నటించింది. సోమవారం మియా మాల్కోవా బర్త్ డే కావడంతో వర్మ ఆమెకు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఆమె అందాన్ని వర్ణిస్తూ వర్మ ట్వీట్ చేయడం విశేషం. 

మియా మాల్కోవా నీకు జన్మదిన శుభాకాంక్షలు.. నీవు అద్భుతమైన సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నా. నీకు అందమైన శరీరం ఉండ లేక అందమైన మనసు ఉందా అనే విషయం నీతో కలసి పనిచేసే వరకు తెలియదు.రెండు విధాలుగా నీవి అందమైన మహిళవు అంటూ మియా మాల్కోవాపై వర్మ ప్రశంసలు కురిపించాడు.