సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం క్లైమాక్స్‌. గతంలో వర్మ దర్శకత్వంలో జీఎస్టీ సినిమాలో నటించిన పోర్న్‌ స్టార్‌ మియా మాల్కోవా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అయితే వర్మ ఈ సినిమాను ఎప్పుడు తెరకెక్కించాడో తెలియదు గానీ లాక్‌ డౌన్‌ సమయంలో రిలీజ్‌కు రెడీ చేశాడు. జస్ట్ ఫ్రీక్‌ అవుట్‌ అంటే సాగే ఈ పాటకు రవిశంకర్‌ సంగీతం అందించగా.. భారతీ గుప్తా ఆలపించింది. పూర్తిగా ఇంగ్లీష్‌లో రూపొందించిన ఆ పాట వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశాడు వర్మ.

రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మియా అందాలను ఓ రేంజ్‌లో చూపించాడు వర్మ. ఎడారి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మియా న్యూడ్‌గానూ నటించింది. గతంలో వర్మ జీఎస్టీ సినిమా విషయంలో కూడా వివాదం జరిగింది. అయితే వర్మ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తను అనుకున్నట్టుగా జీఎస్టీని రిలీజ్ చేశాడు. అయితే క్లైమాక్స్‌ విషయంలో పరిస్థితి కాస్త బెటర్. లాక్‌ డౌన్‌ సమయంలో కావటంతో ఈ సినిమా పెద్దగా విమర్శలు, వ్యతిరేకత లేదు. దీంతో వర్మ ప్రమోషన్‌ కోసం కొత్త పద్దతులు ఫాలో అవుతున్నాడు. ఎ కంపెనీ, ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకాల‌పై శ్రేయాస్‌ ఈటీ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మార్చి 29న శ్రేయాస్‌ ఓటీటీ ప్లాట్‌ ఫాంలో రిలీజ్ కానుంది.