వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మ రాజ్యంలో కడపరెడ్లు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వర్మ సినిమా అంటేనే సహజంగానే వివాదాలు ఉంటాయి. కానీ ఈ చిత్రం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ తో కలకలం సృష్టిస్తోంది. 

పలు వివాదాల నేపథ్యంలో వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్ర టైటిల్ ని 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' అని మార్చుతున్నట్లు తాజాగా ప్రకటించారు. వివాదాలు ఎక్కువవుతుండడంతో వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. కులాల పేర్లతో టైటిల్ పెట్టి అనవసర వివాదాలు సృష్టించే ప్రయత్నం వర్మ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఆంధప్రదేశ్ లోని రెండు వర్గాల మధ్య ఈ మూవీ వైరం పెంచేలా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ చిత్రంలో వర్మ ఎంచుకున్న పాత్రలపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ జగన్ ని హైలైట్ చేస్తూ.. ఇతర రాజకీయ నాయకుల్ని కించపరిచేవిధంగా వర్మ ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాడనే ఆరోపణలు అధికం అవుతున్నాయి. 

అందుకు తగ్గట్లుగానే వర్మ ఈ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ ప్రముఖుల్ని పోలిన పాత్రలు సృష్టించారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ని కించపరిచేలా పలు సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంపై కెఏ పాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

మహేష్ హీరోయిన్ మెస్మరైజింగ్ లుక్స్.. నాజూకైన సొగసుతో ఫోటోషూట్!

కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని అడ్డుకోవాలని కేఏ పాల్ కోర్టు మెట్లు ఎక్కారు. ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో తాజాగా రామ్ గోపాల్ వర్మ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' మూవీ టైటిల్ మార్చుతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్ర కొత్త టైటిల్ 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని అనౌన్స్ చేశారు. 

ఆ తండ్రీకొడుకులకు నా సినిమా అంకితం : రామ్ గోపాల్ వర్మ

నారా లోకేష్ పాత్రని పప్పు అని సంభోదిస్తూ ఓ సాంగ్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ వర్మ మాత్రం ఈ చిత్రంలో పాత్రలకు చంద్రబాబు ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. ఈ చిత్రంపై కోర్టులో కేసులు నమోదువుతున్న నేపథ్యంలో విడుదల అనుమానంగానే కనిపిస్తోంది.