వర్మ ఏది మాట్లాడినా అది సెన్సేషన్ అవుతుంది. అసలు వర్మ అంటేనే సెన్సేషన్. ఇక ఈ రోజు( ఏప్రిల్ 7) బర్త్ డే సందర్భంగా.. ఇంకా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.
వర్మ ఏది మాట్లాడినా అది సెన్సేషన్ అవుతుంది. అసలు వర్మ అంటేనే సెన్సేషన్. ఇక ఈ రోజు( ఏప్రిల్ 7) బర్త్ డే సందర్భంగా.. ఇంకా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.
కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా స్పెషల్ కామెంట్ చేశారు. నేడు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న వర్మ తనను విష్ చేసిన వారికి అంతే డిఫరెంట్ గా సమాధానం చెప్పాడు.బర్త్ డే సందర్భంగా ఆయనకు రిలీజ్ షాక్ తగిలింది. చాలా కాలంగా హాట్ టాపిక్ గా నిలిచిన వర్మ డేంజరస్ మూవీ రిలీజ్ వాయిదా పడింది. థియేటర్ల ఇబ్బందులు వల్ల ఈ సెన్సేషన్ సినిమాను రిలీజ్ చేయలేక పోయానన్నారు వర్మ.
ఇక వర్మ బర్త్ డే సందర్భంగా ఆయనకు చాలా మంది విషెష్ చెపుతున్నారు. స్పెషల్ గా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సినీ గేయ రచయిత సిరాశ్రీ ఓ ట్వీట్ చేశారు. ఆర్జీవీ సర్ జీ మీ గురించి మరో పద్యం రాస్తున్నాను అంటూ.. స్పెషల్ గా పద్యం రాసి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతున్న టైమ్ లో.. దీనికి సమాధానంగా వర్మ మరో ట్వీట్ చేశారు.
సిరాశ్రీ ట్వీట్ చేస్తూ.. సైకిల్ చైనుతో సినిమా... సైకీనే మార్చివేసి చరితాత్ముండై.. జైకొట్టినా ఛీకొట్టినా.. రాకెట్టుగా దూసుకెళ్లు రాముండితడే అని సిరాశ్రీ పద్యం రాశారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. బాగానే ఉంది.. కానీ, నన్ను రావణుడితో పోల్చితేనే నాకు మరింత సంతృప్తిగా ఉంటుంది అని పేర్కొన్నారు. రాముడిని కాదు నేను రావణుడిని అంటూ కామెంట్స్ చేశాడు.
ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆర్జీవీ శైలిలోనే ఆసక్తికర రిప్లైలు ఇస్తున్నారు. హ్యాపీ బర్త్ డే అని చెబుదాం అనుకున్నాను కానీ, నేను చెప్పినా చెప్పకపోయినా నీ లైఫ్ లో నువ్వు హ్యాపీ గా ఉంటావు. పుట్టుక మీద నీకు ఆశ లేదు కాబట్టి బర్త్ డే విషెస్ నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాను అని ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెటాడు.
మొత్తానికి వర్మ బర్త్ డే కూడా ఓ సెన్సేషన్ అయ్యింది. ఎప్పుడూ వర్మ ట్వీట్ కోసం ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్. ఈ మధ్య వరుసగా ట్రిపుల్ ఆర్ గురించి కామెంట్స్ చేస్తూ వచ్చారు వర్మ. ట్రిపుల్ ఆర్ వీడియో కూడా శేర్ చేసి.. ఈ మూవీ డేంజరస్ సినిమాకు 2.0 లాంటిది అన్నారు. ఇలా వర్మ తన స్టైల్ లో తాను వెళ్తూ ఉన్నారు.
