సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ జనవరి 25న రిలీజ్ చేయనున్న గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడియో గురించి ఓ న్యూస్ ఛానెల్ లో చర్చా గోష్టిలో పాల్గొన్నారు. కత్తి మహేష్ తో కలిసి ఈ చర్చలో పాల్గొన్న వర్మ సినిమాతోపాటు తన వ్యక్తిగత అంశాలకు సంబంధించిన విశేషాలపై చర్చించారు. చర్చాగోష్టిలో పాల్గొన్న యువతుల్లో ఓ యువతి ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా మియా మల్కోవాతో సెక్స్ చేశారా అన్న ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు వర్మ చాలా సంతోషం, ఈ ప్రశ్న అడిగినందుకు మీరు నాకు చాలా నచ్చారు అంటూ సమాధానం ఇచ్చారు.

 

మియా మల్కోవాతో జీఎస్టీ షూటింగ్ సందర్భంగా ఆమె నా ఎదుట నగ్నంగా వున్నా నాకు సెక్స్ చేయాలనే కోరిక కలగలేదు అని వర్మ స్పష్టంచేశారు. ఎందుకంటే నేను చేయగలుగుతానో లేదోననే ఆందోళనతో విరమించుకున్నా. ఆమెలాంటి అందం చూసినప్పుడు దేవతలా ఆరాధించడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదని నాకనిపించింది. అంతటి అందగత్తె కళ్లెదుట నగ్నంగా కనిపిస్తే కల్లప్పగించి చూడటం, ఆరాధించడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. నేను సెక్స్ కోసం ఎవరినీ బతిమాలను. ఆమెకు నచ్చితేనే చేస్తా. బలవంతం చేయను. నేను వందల మందిని సెక్స్ కోసం అడిగా. అలాగని అందరూ ఓకే చెప్పలేదు. వాళ్లు కాదన్నా నాకు ఓకే. అలాగని అడగటం మానలేను కదా. అయితే... సెక్స్ కోసం పవర్ వుపయోగిస్తే అది అర్థం లేనిది అంటూ కాస్టింగ్ కౌచ్ గురించి అడిగిన ప్రశ్నకు వర్మ సమాధానం చెప్పారు. నా కూతురుకు కూడా గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ నచ్చిందని వర్మ చెప్పారు.