Asianet News TeluguAsianet News Telugu

నో మొహమాటం...అల్లు అరవింద్ కు డైరక్ట్ గానే నాగ్ చెప్పాడట


తాము ఎక్సెపెక్ట్ చేసిన విధంగా అవుట్ ఫుట్ లేకపోతే రీషూట్ లు చేయటం ఇండస్ట్రీలో అతి సహజం. అయితే ప్రతీ సినిమాకు అది జరగదు. కానీ ఖచ్చితంగా హిట్ కావాలి అనుకుని కాన్సర్టేట్ చేసినప్పుడు ఇలాంటి రీషూట్ లు తప్పవు. ఇప్పుడు నాగార్జున కూడా రీషూట్ అడుగుతున్నారట. అయితే అది తన సినిమా కోసం కాదు. తన కొడుకు అఖిల్ తాజా చిత్రం కోసం అని తెలుస్తోంది. 

Reshoots for Akhil Most Eligible Bachelor?
Author
Hyderabad, First Published Jun 4, 2020, 1:20 PM IST


తాము ఎక్సెపెక్ట్ చేసిన విధంగా అవుట్ ఫుట్ లేకపోతే రీషూట్ లు చేయటం ఇండస్ట్రీలో అతి సహజం. అయితే ప్రతీ సినిమాకు అది జరగదు. కానీ ఖచ్చితంగా హిట్ కావాలి అనుకుని కాన్సర్టేట్ చేసినప్పుడు ఇలాంటి రీషూట్ లు తప్పవు. ఇప్పుడు నాగార్జున కూడా రీషూట్ అడుగుతున్నారట. అయితే అది తన సినిమా కోసం కాదు. తన కొడుకు అఖిల్ తాజా చిత్రం కోసం అని తెలుస్తోంది. 

అఖిల్ కు పెద్ద హిట్ కావాలి. కెరీర్ మొదలు నుంచీ సక్సెస్ అనేది తెలియకుండా గెంటుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ ఇచ్చిన హామీతో తన కొడుకుని ఆయనకు అప్పచెప్పారు నాగార్జున. దాంతో ‘బొమ్మరిల్లు’  భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా పట్టాలెక్కింది. అయితే రీసెంట్ గా తన అంచనాలకు తగినట్లుగా సినిమా ఉందా అని నాగ్ ఈ సినిమా రషెష్ ని చూడటం జరిగిందిట. అయితే ఆయన పూర్తిగా సంతృప్తి చెందలేదని టాక్. దాంతో అల్లు అరవింద్ ని ఈ విషయమై సంప్రదిస్తే ..రీషూట్ ప్లాన్ చేద్దామని చెప్పారట. 

ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఎపిసోడ్స్ అంత ఎట్రాక్టివ్ గా లేవని అనిపించాయిట. దాంతో బొమ్మరిల్లు భాస్కర్ ని పిలిచి ఆ సీక్వెన్స్ లని మరింత ఎఫెక్టివ్ గా ఉండేలా ప్లాన్ చేసి, రీషూట్ చేయమని అడిగారట. ఒక్కసారి షూటింగ్ లకు ఫర్మిషన్స్ వచ్చాక, రీషూట్ కు ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ఇంకా నెల రోజుల వర్క్ బాలెన్స్ ఉంది. అది కూడా పూర్తి చేయాలి.  వాస్తవానికి ఈ వేసవిలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ తో వాయిదా పడింది. 

ఇక  ఈ సినిమాలో అఖిల్ ఓ ఎన్నారై. తన వివాహం కోసం ఇండియాకు వస్తాడు. ఇక్కడ వరసపెట్టి అమ్మాయిలను చూస్తాడు. ఈ క్రమంలో పూజ హెగ్డే పరిచయం అవుతుంది. ఆమె తనకు ఫెరఫెక్ట్ అనుకుంటాడు. అయితే ఆమెతో సన్నిహితంగా మెలిగే కొలిదీ..కొన్ని క్వాలిటీస్ విషయంలో తప్పించి తనకు, ఆమెకు ఆమడ దూరం అని అర్దం చేసుకుంటాడు. ఆమె గురించి రోజు రోజుకీ నెగిటివ్ గా అనిపిస్తుంది. ఓ టైమ్ లో ఇంక ఆమె వద్దు అని డిసైడ్ అయ్యిపోయి..బ్రేకప్ చెప్పేస్తాడు. అయితే ఆ తర్వాత ఆమెపై ఉన్న ప్రేమ అతన్ని ఆమెలో తను నెగిటివ్ గా భావించే క్వాలిటీస్ ని పాజిటివ్ గా కనిపించేలా చేస్తుంది. పూర్తి ఫన్ తో, ఎమోషన్స్ తో ఈ సినిమాని రూపొందించారని చెప్తున్నారు. 
 
 తెలుగులో 'ఒంగోలుగిత్త' సినిమాకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు అఖిల్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  హీరోయిన్ పూజ హెడ్గే పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమిడయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు.  
 
అఖిల్ ఈ సినిమాలో అప్పర్ మిడిల్ క్లాస్ యువకుడుగా కనిపించనున్నారు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  కెరీర్ ప్రారంభం నుంచీ  ఇంతవరకు హిట్ అంటే తెలియని హీరోగా వెళ్తున్న అఖిల్ నాల్గవ సినిమాగా వస్తోంది ఈ చిత్రం.  ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ,అక్కినేని అభిమానులు ఆశలు మాములుగా పెట్టుకోలేదు. వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios