Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాక్ట్ చెక్: మహేష్ మీద ఈ వార్త పూర్తి అబద్దం

రీసెంట్ గా మహేష్ బాబుపై ఓ వార్త దావానలంగా వ్యాపించింది. పెద్ద పెద్ద మీడియా సంస్దలు సైతం ఆ వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చాయి. ఆ వార్త మరేదో కాదు మహేష్..కొత్తగా 

Reports about Mahesh Babu OTT plans turn false
Author
Hyderabad, First Published Apr 14, 2020, 8:58 AM IST


కరోనా టైమ్ లో బయిట సినిమాల పరంగా ఓ విధమైన అలజడి లేదు. దాంతో మీడియా సొంత వంటకాలకు దిగింది. ఈ క్రమంలో  కొత్త కొత్త వార్తలు ఊపిరి పోసుకుంటున్నాయి. మీడియావాళ్లు క్రియేటివిటిని ఓ రేంజిలో ప్రదర్శిస్తూ  వార్తలు క్రియేట్ చేస్తున్నారు.రీసెంట్ గా మహేష్ బాబుపై ఓ వార్త దావానలంగా వ్యాపించింది. పెద్ద పెద్ద మీడియా సంస్దలు సైతం ఆ వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చాయి. ఆ వార్త మరేదో కాదు మహేష్..కొత్తగా ఓటీటి ప్లాట్ ఫామ్ పెట్టబోతున్నాడని. మహేష్ నటుడుగానే కాకుండా బిజినెస్ మ్యాన్ గానూ పాపులర్ కావటం కలిసొచ్చింది.

ఆ వార్త సారాంశం ఏమిటి అంటే...ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఏ స్దాయిలో  డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా అనే యాప్‌తో డిజిటల్ ప్లాట్‌ఫాంలో అడుగుపెట్టగా అది పెద్దగా సక్సెస్ కాలేదు.దీంతో తెలుగులో ఓటీటీ బిజినెస్‌కు పెద్ద డిమాండ్ లేదని రిలయన్స్ గుర్తించింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం జియో రిలయన్స్ ఈ ఓటీటీ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడే మనవాళ్లు ఈ రిలియన్స్ ని తీసుకొచ్చి మహేష్ తో ముడెట్టేసారు.  

ఆ ప్రాజెక్టులో పెట్టాలనకున్న సొమ్మును మహేష్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌కు ట్రాన్ఫర్ చేస్తోందట.ఈ విధంగా తెలుగులో పలు చిన్న సినిమాలను ఈ బ్యానర్ ద్వారా నిర్మించాలని జియో రిలయన్స్ భావిస్తోంది. అవన్నీ తమ ఓటీటి ప్లాట్ ఫామ్ లో అప్ లోడ్ చేస్తారట. మహేష్ కు ఇరవై ఐదు శాతం ఇమేజ్ వాడుకున్నందుకు, బిజినెస్ చేసినందుకు రిలియన్స్ మిగతా 75 శాతం తీసుకుంటుందని లెక్కలు కూడా చెప్పేసారు. 

అయితే అసలు అలాంటి ఆలోచన మహేష్ కు ఏమీ లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసలు మహేష్ ని ఈ విషయమై ఎవరూ సంప్రదించలేదని వార్త. ఈ కరోనా క్రైసిస్ అవ్వగానే తన తదుపరి చిత్రం ఎనౌన్స్ చేసే పనిలో మహేష్ ఉన్నారు. ఇప్పటికే ఎఎమ్ బి లో మల్టిఫ్లెక్స్ లపై పెట్టుబడి పెట్టిన మహేష్, జిఎమ్ బి అంటూ ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టారు. అంతేకానీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రస్తుతానికి అయితే పెట్టే ఆలోచన ఏ కోసానా లేదట. 
 

Follow Us:
Download App:
  • android
  • ios