ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండం కొన‌సాగుతోన్న సంగతి తెలిసిందే. సామాన్యులే కాదు... ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఇక ఇప్పటికే  చాలా మంది ఈ మ‌హ‌మ్మారిని జయించగా.. కొంద‌రు క‌న్నుమూశారు. ఇదిలా ఉంటే న‌టి రేణు దేశాయ్‌కి కూడా క‌రోనా సోక‌గా.. ఆ త‌రువాత కోలుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా లైవ్‌లో వెల్ల‌డించించారామె.

లైవ్ ఛాట్ లో రేణు మాట్లాడుతూ...క‌రోనా ఎక్కడా త‌గ్గ‌లేద‌ని.. ప‌రిస్థితులు అలానే ఉన్నాయ‌ని రేణు అన్నారు. అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆమె సూచించారు. అవ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌ని రేణు చెప్పారు. అలాగే పండుగ‌లు మ‌న‌కు ఎంతో ముఖ్య‌మని.. కానీ ఎక్కువ‌గా ఒక్క చోట గుమికూడ‌టం లాంటివి చేయ‌కండ‌ని రేణు కోరారు. ఇక‌ క‌రోనా సోక‌డంతో తాను కొన్ని రోజుల పాటు ఇంటికి పరిమితం అయ్యాన‌ని.. అందుకే షూటింగ్‌ల‌కు కూడా బ్రేక్ ఇచ్చాన‌ని ఆమె అన్నారు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌ల‌కు వెళుతున్నాన‌ని రేణు వివ‌రించారు.

  ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న రేణు దేశాయ్.. అక్క‌డ అభిమానులు అడిగిన చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. అందులో భాగంగా మీరు మ‌హేష్ బాబు స‌ర్కారు పాట‌లో న‌టిస్తున్నారా..? అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించగా.. లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఏదైనా ఉంటే తాను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాన‌ని రేణు వెల్ల‌డించారు.