బాలయ్య గురించి ఇండస్ట్రీలో కథలు కథలు గా చెప్తారు. ఒక్కసారి స్క్రిప్టు ఓకే చేస్తే డైరక్షన్ విషయంలో వేలు పెట్టరని, అలాగే సినిమాకు సంభందించి మిగతా విషయాలు ఆయన పట్టించుకోరని, వేలు పెట్టరని చెప్తారు. అంతేకాదు గాసిప్ లకు, వార్తలకు ఆయన దూరంగా ఉంటారని, తన ప్రపంచంలో తాను ఉంటూ హ్యాపీగా తన పనేదో తాను చూసుకుంటారని, ఇలా బాలయ్య మిగతా హీరోలకు భిన్నంగా బిహేవ్ చేస్తూంటారు. ముఖ్యంగా క్రమశిక్షణ ఆయన పాటిస్తూంటారు. ఇతరులపై కామెంట్స్ చేయటం, వెనక మాట్లాడటం చేయరకు కాబట్టే వ్యక్తిగతంగా ఆయనంటే చాలా మందికి గౌరవం. ఈ క్రమంలో తనపై గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు ఆయన దాకా చేరలేదట. ఇంతకీ ఏమిటా వార్తలు అంటే...ఆయన్ను ఓ మళయాళ రీమేక్ లో అడగబోతున్నారని.
  
స‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ప్రస్తుతం అమెజానన్  ప్రైమ్ లో దొరుకుతోంది. ఇందులో పృథ్వీరాజ్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ ద‌క్కించుకున్నార‌ు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. 

వారిలో  ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని, మరో హీరోగా రానా ని  అనుకుంటున్నట్టు  వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పటిదాకా ఈ వార్తలేవీ బాలయ్యను చేరలేదట. అలాంటి రీమేక్ కు తనతో చేద్దామని నిర్మాతలు భావిస్తున్నట్లు కూడా ఆయనకు తెలియదట. నిర్మాతలు కూడా తెలుగు నేటివిటి తో స్క్రిప్టు పూర్తయ్యాక,ఒకేసారి బాలయ్యను కలుద్దామనే ఆలోచనలో ఉన్నారట.

 ఆయనకు మళయాళ సినిమా చూపెట్టడం కన్నా, తెలుగు వెర్షన్ స్క్రిప్టు  నేరేషన్ ఇవ్వటం బెస్ట్ అని భావిస్తున్నార్ట. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు డైరెక్టర్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఒకసారి ఫైనల్ అయ్యాకా బాలకృష్ణని సంప్రదించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుని బి.గోపాల్ చేతిలో పెడితే ఎలా ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.  ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయట.

 2019లో మూడు ప్లాపులు మూటగట్టుకున్న బాలయ్య... ప్రస్తుతం తనకు వరస హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఒక షెడ్యూల్  జరిగిన ఈ షూటింగ్.. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఆగింది.  మరో ప్రక్క ..సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఇటీవలే నితిన్ నటించిన భీష్మ తో పెద్ద హిట్ అందుకుంది. అంతేకాకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.  ప్ర‌స్తుతం నితిన్ ,కీర్తి సురేష్‌ల‌తో రంగ్‌దే, నానితో శ్యామ్ సింగ‌రాయ్‌. నాగ‌శౌర్య‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్‌దే జులై 30న, శ్యామ్ సింగ‌రాయ్‌ డిసెంబర్ 25న (క్రిస్మస్ సందర్భంగా) విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.