కరోనా టైమ్ ని క్యాష్ చేసుకునేందుకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ...కరోనా వైరస్ టైటిల్ తో ఓ సినిమా ప్లాన్ చేసి,షూట్ చేసి, ట్రైలర్ వదిలారు. ఆ వెంటనే ఇప్పుడు రెడ్ జోన్ టైటిల్ తో మరో సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాని ఔత్సాహిక దర్శకుడు శేషు కేఎమ్ ఆర్ డైరక్ట్ చేసారు. లాక్ డౌన్ టైమ్ లో తన టీమ్ తో కలిసి తీసిన సినిమా ఇది అని చెప్తున్నారు.
 
అయితే ఇది యాక్టువల్ గా ఎదురుగా సెట్ లో ఉండి డైరక్ట్ చేసింది కాదని, అలాగే నైపుణ్యం కల డీఓపి ఉండి తెరకెక్కించిన సీన్స్ కాదని చెప్పారు. అలాగే హైదరాబాద్, ముంబై, పూనే, చెన్నైలలో ఉన్న తమ టీమ్ సెల్ఫ్ షాట్స్ తో తెరకెక్కించిందని, లాక్ డౌన్ రెగ్యులేషన్స్ కు వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేదని, ఆ రూల్స్ కు లోబడే తమ తమ ఇళ్లల్లో తీసిన సన్నివేశాలతో కలిపి తీసిన సినిమా అని తేల్చారు.

ఇదొక ప్రయోగం అని, లాక్ డౌన్ టైమ్ స్టక్ అయిపోయిన తమ డెక్కన్ (హైదరాబాదీ)  టీమ్  లో ..జీవితం,దిన చర్య చుట్టూ తిరిగుతుందని అన్నారు.  స్టోరీ పోగ్రస్ అయ్యేకొలిదీ ప్రతీ పాత్ర ఎమోషన్ ట్రాన్సిక్షన్ ఉంటుందని చెప్పారు. తాము వదిలిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని ,ఈ లాక్ డౌన్ టైమ్ లోనే రిలీజ్ చేస్తామని అన్నారు.