ఈ లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్న సంగతి తెలిసిందే.  జనం ఇళ్లల్లోనే ఉండటంతో ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. మంచి కంటెంట్ ఉన్న ఓటీటీలకు భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ క్రమంలో ఓటీటి సంస్ధలన్నీ కంటెంట్ కోసం వేట మొదలెట్టాయి. అందులో భాగంగా  ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత  పెడుతున్నారు.  తెలుగులో ప్రస్తుతం చాలా చిన్న సినిమాలు ఓటీటీలోకి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్, అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న నిశ్శబ్దం సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయని టాక్ నడిచింది. కానీ విడుదలకాలేదు. 

అయితే ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకుండా డెరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరువాలేదనిపించింది. అందాలతార కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' అనే తమిళ చిత్రం కూడా ముందుగా డిజిటల్ మీడియా ద్వారా విడుదల కానుంది. ఈ క్రమంలో మరో సినిమా ఓటీటీ విడుదలకానుందని ప్రచారం సాగుతోంది.  మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నసినిమా 'ఉప్పెన' . ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ పై బుచ్చిబాబు దర్సకత్వం వహిస్తున్నారు. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. దాంతో ఈసినిమాను డిజిటల్ రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం మేరకు మైత్రీ మూవీస్ వారు ఈ ప్రపోజల్ ని ప్రక్కన పెట్టినట్లు సమాచారం. 
 
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఓటీటి ఆఫర్ ని రిజెక్ట్ చేయటానికి సాలీడ్ రీజన్ ఉందని తెలుస్తోంది. ఉప్పెన సినిమాలో లీడ్ రోల్స్ ఇద్దరూ కొత్తవాళ్లు అయినా పద్దెనిమిది కోట్లు దాకా నిర్మాతలు ఖర్చు పెట్టారట. అయితే కొత్తవాళ్లు నటించిన సినిమాకు ఓటీటి వాళ్లు అంత పెద్ద మొత్తం ఇవ్వటానికి ఇష్టపడరు. కాబట్టి మినిమం బడ్జెట్ రికవరీ కూడా కానప్పుడు సినిమా తీసి ఫలితం ఏముంది. ఓ నాలుగు నెలలు లేటు అయినా థియోటర్ రిలీజ్ బెస్ట్ అని నిర్మాతలు భావించి వెయిట్ చేద్దామనే నిర్ణయానికి వచ్చారట. ఈ లాజిక్ గమనించకుండా మీడియాలో ఈ సినిమాని ఓటీటికు ఇచ్చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 
 
 ఇక ఈ సినిమాపై నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు బాగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు తమకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని, రంగస్దలం సినిమాలా ఆడుతుందని నమ్ముతున్నారు. అందుకునే ఈ చిత్రం నాన్ థియోటర్ రైట్స్ కు మంచి ఆఫర్స్ వస్తున్నా అమ్మలేదని తెలుస్తోంది. అలాగే తమ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని అన్ని ఏరియాలు సొంతగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. సినిమా కనుక సూపర్ హిట్ అయితే నాన్ థియోటర్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోతాయని నమ్ముతున్నారు.థియోటర్ ఓవర్ ప్లో ..తమని సేఫ్ జోన్ లో పడేస్తుందని వారి ధీమా.  
 
ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో రిలీజ్ డేట్ ఖరారు చేయటం కొంచెం కష్టమే. కొద్దికాలం వెయిట్ చేయాల్సిందే.