రష్మిక ఎందుకు కొత్త సినిమాలు సైన్ చేయటం లేదు..ఇప్పుడు ఆమె అభిమానులందరిలో ఇదే సందేహం. సరిలేరు నీకెవ్వరూ, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాల రిలీజ్ తర్వాత ఆమెకు ఏర్పడింది మామూలు క్రేజ్ కాదు. ఆమెకు ఓ రేంజిలో ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే చిత్రంగా ఈ సంవత్సరం ఆమె ఏ కొత్త చిత్రం సైన్ చేయలేదు. క్రితం సంవత్సరం ఆమె అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ చిత్రం మాత్రమే సైన్ చేసింది.
 
వాస్తవానికి రష్మిక ని..మరో రెండు పెద్ద సినిమాల కోసం అనుకుని అడగటం జరిగింది. అయితే ఏదీ మెటీరియలైజ్ కాలేదు. అందుకు కారణం రష్మిక చెప్తున్న భారీ రెమ్యునేషన్ అని అంటున్నారు. ఇప్పటిదాకా ఆమె రెమ్యునేషన్ కోటి లోపే ఉంది. అయితే ఎప్పుడైతే తన పాపులారిటీ పెరిగిందో..తన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయో..ఆమె కోటి డిమాండ్ చేస్తోంది. ఇది కాస్త నిర్మాతలకు ఇబ్బందిగానే ఉంది. ఈ నేపధ్యంలో ఆమెను తీసుకోవాలా ..వేరే ఆల్టర్నేటివ్ ని వెతుక్కోవాలా అనే డైలమోలో ఉన్నారు నిర్మాతలు.

ఇదిలా ఉంటే రష్మిక మాత్రం ఉత్సాహంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతోంది. ఇనిస్ట్రగ్రమ్ లో కొత్త కొత్త ఫొటోగ్రాఫులతో హల్ చల్ చేస్తోంది. అక్కడ ఆమె గ్లామర్ అవుట్ ఫిట్ లతో రెచ్చిపోతోంది. ఇవన్నీ చూసినవారు రష్మికను తెగ ఫాలో అయ్యిపోతున్నారు. నిర్మాతలుకు తన క్రేజ్ ని ఈ రకంగా చూపించి రష్మిక తను అనుకున్న రెమ్యునేషన్ ని పొందేటట్లు ఉంది.