సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ తన తదుపరి చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తారనే అందరూ అనుకున్నారు. నిజమేనంటూమహేష్ ,వంశీ పైడిపల్లి స్పష్టత ఇచ్చారు. మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ మాఫియా డాన్ గా కనిపిస్తారని ఓ ప్రచారం కూడా జరిగింది. అయితే ఊహించని విధంగా మహేష్ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారట. ఆయన వంశీ పైడిపల్లితో కాకుండా వేరే దర్శకుడితో చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ ఈ ప్రాజెక్టు వద్దనుకోవటానికి కారణం ...వంశీ పైడిపల్లి చెప్పిన స్క్రిప్టు నచ్చకపోవటమే అని వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే అసలు నిజం అది కాదట.

దిల్ రాజు నిర్మాతగా రూపొందే ఈ చిత్రం నిమిత్తం ...ఆఫర్ చేసిన రెమ్యునేషన్ మహేష్ కు నచ్చలేదట. దాంతో హర్ట్ అయిన మహేష్ వెంటనే ప్రాజెక్టుని కాల్ ఆఫ్ చేసారట. అంతేకాకుండా ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగా అవుతుందిట. సరిలేరు నీకెవ్వరు సినిమా చిన్న బడ్జెట్ లో  చేసేసి పెద్ద హిట్ కొట్టారు. ఆ విషయం కూడా ప్రస్దావన కి వచ్చిందిట. సినిమాపై అంతంత బడ్జెట్ పెడితే మహేష్ రెమ్యునేషన్ లో కోతపడుతుందిట. అలాగే మహర్షి కు అనుకున్న స్దాయిలో లాభాలు రాలేదట. మీడియాలో జరిగినంత హైప్ కు తగ్గట్లు డబ్బు రాకపోవటంతో...మళ్లీ అలాంటి పరిస్దితి వస్తుందని దిల్ రాజు భయపడ్డారట. దాంతో మొదటే ప్రాజెక్టు పై పెట్టే పెట్టుబడిని కంట్రోలులో పెట్టాలని ఫిక్స్ అయ్యారట. మహేష్ కు ఇది నచ్చక వద్దని ప్రక్కకు తప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు.

 అయితే వంశీ పైడిపల్లి మాత్రం తన నెక్ట్స్ మూవీని దిల్ రాజు బ్యానర్ లోనే చేయబోతున్నాడని... ఈ మేరకు   వీళ్లిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరిందని సమాచారం.   అలాగే హీరోల విషయానికొస్తే, వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇధ్దరూ  ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. గతంలో ఈ దర్శకుడితో ఇద్దరూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది. 

ఎన్టీఆర్ సైతం వంశీతో మరోసారి వర్క్ చేయడానికి సై అన్నారట.  అయితే మెగా హీరోతోనే వంశీ పైడిపల్లి ముందుకు వెళ్తారని, అదీ దిల్ రాజు బ్యానర్ లోనే అంటున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.