Asianet News TeluguAsianet News Telugu

చరణ్ పై శంకర్ ఫోటో షూట్.. ఆర్సీ 15 పనులు షురూ!

నేడు అన్నపూర్ణ స్టూడియోలో చరణ్ పై శంకర్ ఫోటో షూట్ నిర్వహించారు. ప్రముఖ ఫోటో గ్రాఫర్స్ పాల్గొన్న ఈ షూట్ కి సంబంధించిన డిటైల్స్ సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి.

rc 15 preproduction work shankar conducts a photo shoot on ram charan
Author
Hyderabad, First Published Sep 7, 2021, 4:03 PM IST

రామ్ చరణ్ ప్రాజెక్ట్ పనులు మొదలెట్టేశారు దర్శకుడు శంకర్. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా, చరణ్ పై లుక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నేడు అన్నపూర్ణ స్టూడియోలో చరణ్ పై శంకర్ ఫోటో షూట్ నిర్వహించారు. ప్రముఖ ఫోటో గ్రాఫర్స్ పాల్గొన్న ఈ షూట్ కి సంబంధించిన డిటైల్స్ సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. 


టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఈ మెగా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా శంకర్ తెరకెక్కించనున్నారు. చరణ్ కి జంటగా కియారా అద్వానీ ఈ మూవీలో నటిస్తున్నారు. చరణ్ తో కియారాకు ఇది చివరి చిత్రం. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశలో ఉండగా, త్వరలోనే శంకర్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. 


మరోవైపు ఈ ప్రాజెక్ట్ కథపై చిన్న వివాదం నడుస్తుంది. శంకర్ చరణ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కథ నాదే అంటూ తమిళ చిత్ర రచయిత చెల్లముత్తు సౌత్ రచయితల మండలిలో పిర్యాదు చేశారు. సౌత్ రచయితల సంఘం ఈ వివాదానికి పరిష్కారం చూపనుంది. ఇక ఈ మూవీ కథపై అప్పుడే అనేక కథనాలు చక్కర్లు కొట్టాయి. చరణ్ యంగ్ సీఎంగా కనిపించనున్నారనే పుకార్లు, గట్టిగా వినిపించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios