Asianet News TeluguAsianet News Telugu

అటు రజనీ, ఇటు చిరంజీవి, మధ్యలో రవితేజ

 రవితేజ క్రాక్ సక్సెస్ తర్వాత రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన రమేష్ వర్మ డైరెక్షన్ లో ఈ ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు.  ఖిలాడీ చిత్రంలో మరోసారి రవితేజ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయబోతున్నారు.

Ravi Tejas Khiladi aims Diwali Release
Author
Hyderabad, First Published Sep 3, 2021, 7:17 AM IST

'ఖిలాడి' టైటిల్ తో మరోసారి రవితేజ..తనదైన మాస్ యాక్షన్ ఎంటర్టేనర్‌తో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా గ్లింప్స్  ఇప్పటికే విడుదల అయ్యి క్రేజ్ తెచ్చుకున్నాయి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టాడు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  వరసపెట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తున్న ఈ టైమ్ లో ఈ సినిమా రిలీజ్ బయిటకు వచ్చింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా దీపావళి కానుకగా మన ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజికి వచ్చింది. అసలు మొదట ఈ సినిమాని వేసవి సెలవులు టైమ్ లో అంటే మే నెలలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తో పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చి దీపావళికు మన ముందుకు రానుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
   
మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సక్సెస్ తర్వాత రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన రమేష్ వర్మ డైరెక్షన్ లో ఈ ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు.  ప్రణీత ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నర్తించనుందని సమాచారం. ఖిలాడీ చిత్రంలో మరోసారి రవితేజ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయబోతున్నారు. ర‌వితేజ న‌టిస్తోన్న‌ 67వ సినిమా. ఇందులో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమా డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ , బాలీవుడ్‌కి చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా ‘దీపావళి’ పండగపై ‘ఆచార్య’ కన్ను పడిందట. దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీన ‘ఆచార్య’ను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఇప్పటి వరకూ దీనిని అధికారికంగా ప్రకటించ లేదు. రెండు పాటలు మినహా ‘ఆచార్య’ మొత్తం పూర్తయింది. ఈ రెండు పాటలను కూడా వీలయినంత త్వరగా పూర్తి చేసి దీపావళి విడదలకు సన్నద్ధం అవుతున్నారట. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’లో చిరంజీవి టైటిల్ పాత్రలో కనిపించనుండగా రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే ఇప్పటికే దీపావళికి రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా మెగాస్టార్ రంగంలోకి దిగితే.. మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ ఎలా ఉంటుందనేది అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. 

మరోవైపు రవితేజ శరత్ మాండవ డైరెక్షన్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్నారు. రవితేజ 68వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నారు. దివ్యాంశి కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవితేజ పవర్ ఫుల్ సబ్జెక్ట్స్ ను ఎంచుకుంటూ తన తరువాత సినిమాలపై అంచనాలను అంతకంతకూ పెంచుతుండటం గమనార్హం. ఒకే సమయంలో రవితేజ ఖిలాడీతో పాటు శరత్ మాండవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios