అసలే రవితేజ కెరీర్ ఏమీ బాగోలేదు. ఆయన వరసపెట్టి అన్ని డిజాస్టర్స్ నే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన దగ్గరకు ఉత్సాహంగా వచ్చి సినిమా చేస్తాను అనే నిర్మాతలు, దర్శకులే తక్కువ మంది ఉంటారు. వేరే స్టార్స్ తో డేట్స్ దొరకనప్పుడు ఆప్షన్ గా రవితేజను ఆశ్రయిస్తారు. ఈ విషయం రవితేజకూ తెలుసు. ఈ నేపధ్యంలో ఆయన ఓ ప్రాజెక్టు ఓకే చేసి, అడ్వాన్స్ పుచ్చుకున్నారు. అయితే ఆయనకు ఆ సినిమా చేయటం ఇష్టం లేదని, దర్శకుడని బకరా చేస్తున్నాడని వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి.

వివరాల్లోకి వెళితే...ఆ మధ్యన రవితేజ ...రాక్షసుడుతో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా ఓకే చేసారు. అది ఓ తమిళ చిత్రం రీమేక్ అని తెలుస్తోంది. ఈ మేరకు తమిళంలో ఆ సినిమా నిర్మించిన కంపెనీవాళ్లే రవితేజకు, రమేష్ వర్మకు అడ్వాన్స్ ఇచ్చారు. రమేష్ వర్మ ఉత్సాహంగా రాత్రింబవళ్లూ ఆ స్క్రిప్టు మీద కూర్చుంటున్నారు. త్వరలోనే ఫైనల్ వెర్షన్ వినిపించాలని రెడీ చేస్తున్నారు. ఓ ప్రక్కన డైలాగ్ వర్క్ సైతం జరుగుతోంది. అయితే ఇక్కడే ట్విస్ట్ పడిందని చెప్తున్నారు.

రవితేజ కేవలం అడ్వాన్స్ తీసుకున్నాడే కానీ ఈ ప్రాజెక్టు మీద ఇంట్రస్ట్ లేదని మీడియాలో ప్రచారం అవుతోంది. రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో గతంలో ఓ చిత్రం వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఆ ఎక్సపీరియన్స్ తో రమేష్ వర్మతో సినిమా చేయటానికి పెద్దగా ఉత్సాహం లేదట రవితేజకు. అయితే అసలే కెరీర్ బాగోనప్పుడు ..ఇంటికి వచ్చి యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నవారిని కాదనటం ఎందుకుని తీసుకున్నారట. దర్శకుడు ని మార్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియదు. రవితేజ గతంలో ఎప్పుడూ ఇలా చేసింది లేదు. ఇది రూమర్ కాకుండా నిజమైతే మాత్రం రవితేజ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

అయితే ప్రస్తుతం క్రాక్ సినిమా లో ఉన్న రవితేజ..లాక్ డౌన్ పూర్తయ్యాక మిగతా షూట్ పూర్తి చేస్తారు. క్రాక్ తర్వాత..వక్కంతం వంశీ సినిమా చేస్తారని చెప్తున్నారు. అయితే రమేష్ వర్మ మాత్రం సిన్సియర్ గా తన పని తాను చేసుకుపోతున్నారట. ఎందుకంటే ఇది రూమర్ కావచ్చు. తన ప్రాజెక్టు ఆపినప్పుడు అప్పుడు కదా ఆలోచించాల్సింది అనే యాటిట్యూడ్ తో ముందుకు వెళ్తున్నాడట. సినీ పరిశ్రమలో ఇలాంటి గేమ్స్ సర్వ సామాన్యం అంటున్నారు ఇది విన్నవారు.