Asianet News TeluguAsianet News Telugu

మరోసారి డ్రగ్స్ కేసులో రవితేజ

  • ఇటీవలే డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న టాలీవుడ్ హీరో రవితేజ
  • రవితేజతోపాటు విచారణ ఎదుర్కొన్న పలువురు తెలుగు సెలెబ్రిటీలు
  • తాజాగా గంజాయి పట్టివేత కేసులో మరోసారి రవితేజ పేరు
ravi teja name again in drugs case

తెలుగు చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ దందా వ్యవహారం మరువకముందే.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీనటుడు రవితేజ పేరు మరోసారి బైటపడటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా కర్ణాటకలో డ్రగ్స్ వ్యవహారంలో సినీ హీరో రవితేజ పేరు మరోసారి బట్టబయలైంది. ప్రముఖ కన్నడ న్యూస్ ఛానెల్ సువర్ణ న్యూస్ కథనం ప్రకారం ఇటీవల ఓ యాక్సిడెంట్ కేసులో పట్టుబడ్డ వ్యక్తి వద్ద గంజాయి దొరకటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తికి రవితేజతో సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు కథనం వెలువడింది.

 

తెలుగు స్టార్ హీరో రవితేజ కు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు ఓ గంజాయి పట్టివేత కేసు విచారణలో బయటపడటం ఇప్పుడు కర్ణాటక కేంద్రంగా హాట్ న్యూస్ గా మారింది. రవితేజకు డ్రగ్స్ సప్లై చేసే ముఠాతో సంబంధాలున్నట్లు కన్నడ నాట టివిల్లో వార్తలు మారుమ్రోగిపోతున్నాయి. కర్ణాటక నుంచి అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

 

చిత్తూరు పారిశ్రామికవేత్త దివంగత ఆదికేశవులునాయుడు మనవడు గత రెండు రోజుల క్రితం కార్ యాక్సిడెంట్ కేసులో బెంగుళూరులో అరెస్టయ్యాడు. ఆయన కారులో గంజాయి పొట్లాలు లభించాయి. దీంతో ఆ గంజాయిని తనకు రవితేజ సప్లై చేశాడంటూ ఆదికేశవులు నాయుడు మనవడు పోలీసులకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు.

 

దీనిపై కన్నడ పోలీసులు కూడా సమాచార సేకరణలో పడ్డారు. సమాచారం మీడియాకు చేరడంతో కన్నడ నాట రవితేజ గురించిన డ్రగ్స్ కథనాలు మారుమోగుతున్నాయి. హైదరాబాద్ లోనూ డ్రగ్స్ కేసులో హీరో రవితేజ సిట్ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నాట కూడా రవితేజ డ్రగ్స్ వ్వయహారం మరోమారు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. మరి దీనిపై రవితేజ ఎలా స్పందిస్తాడో.. అసలు రవితేజకు ఈ కేసుతో సంబంధం వుందా.. లేక కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios