Asianet News TeluguAsianet News Telugu

‘ఖిలాడి’ డైరక్టర్ పై కోప్పడ్డ రవితేజ?

ఈ విషయమై రవితేజ అప్ సెట్ అయ్యారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. క్రితం సంవత్సరం లాంచ్ అయ్యిన ఈ సినిమా కరోనా తో ఇప్పటిదాకా ఇంకా ప్రొడక్షన్ లోనే ఉంది. అయితే రవితేజ మొదట అనుకున్న డేట్స్ కన్నా ఎక్కువ కేటాయించినా ఇంకా పూర్తి చేయలేదట.

Ravi Teja miffed with the  Khiladi director? jsp
Author
Hyderabad, First Published Jul 19, 2021, 4:51 PM IST

‘క్రాక్‌’ సినిమా విజయంతో దూకుడు మీదున్న మాస్‌ హీరో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఖిలాడి’. రమేష్‌ వర్మ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం  సమకూరుస్తున్నారు. తన 67వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఈ విషయమై రవితేజ అప్ సెట్ అయ్యారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. క్రితం సంవత్సరం లాంచ్ అయ్యిన ఈ సినిమా కరోనా తో ఇప్పటిదాకా ఇంకా ప్రొడక్షన్ లోనే ఉంది. అయితే రవితేజ మొదట అనుకున్న డేట్స్ కన్నా ఎక్కువ కేటాయించినా ఇంకా పూర్తి చేయలేదట. దాంతో దర్శకుడు రమేష్ వర్మపై కోపంగా ఉన్నట్లు సమాచారం. 

ఎందుకంటే రవితేజ తన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వరస డేట్స్ ఆ సినిమాకు కేటాయించారు. ఇప్పుడు మధ్యలో మళ్లీ ఖిలాడీకు డేట్స్ ఇస్తే రామారావు అన్ డ్యూటీకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఖిలాడీని మే నెలలో రిలీజ్ అనుకున్నారు. షూటింగ్ పూర్తి కాలేదు. రవితేజ డేట్స్ మాత్రమే కాదు.. హీరోయిన్స్ గా చేస్తున్న డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి కూడా బిజీగా ఉన్నారు. అందరి కాంబినేషన్ అంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది. దాంతో రవితేజ...రమేష్ వర్మతో ఇప్పుడు ఇమ్మిడియట్ గా డేట్స్ ఇవ్వటం కష్టమని, మిగతా వాళ్లతో షూటింగ్ పెండింగ్ లు పూర్తి చేయమని తర్వాత వరస పెట్టి లాగుదామని చెప్పారట. కానీ రమేష్ వర్మ ఎలోగోలా కొద్ది రోజులు ఎడ్జస్ట్ చేయమని రవితేజ చుట్టూ తిరుగుతున్నారట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. 
  

రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా రవితేజ ఎంతో ఎనర్జీటిక్‌గా కనిపించనున్నారు. అర్జున్, ఉన్ని ముకుందన్, నికితిన్ ధీర్, సచిన్ ఖేడెకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అనసూయ, ఠాకూర్ అనూప్ సింగ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్‌ గ్లింప్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.  సినిమాకి సుజిత్ వాసుదేవ్, జి.కె.విష్ణు సినిమాటోగ్రాఫర్లు‌గా పనిచేస్తున్నారు. సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెత్స నిర్మాతలు.  గతంలో రవితేజ.. రమేష్‌ వర్మ దర్శకత్వంలో ‘వీర’ అనే చిత్రం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios