రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ -క్రాక్. ఈ మే 8న క్రాక్‌ను థియేటర్లకు తేవాలనుకున్నారు నిర్మాత ఠాగూర్ మధు. అయితే ఆ ఆలోచనను కరోనా హైజాక్ చేసేసింది. సినిమా షూటింగ్ లే నిర్దాక్ష్యణంగా ఆపేసిన పరిస్దితి. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తుతారా...జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు జరుపుదాం  అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇదే పరిస్దితి రవితేజా తాజా చిత్రం క్రాక్ ది కూడాను. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసి  `క్రాక్` సినిమా టీజర్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్.  బాగానే క్రేజ్ వచ్చింది. అయితే ఇంకా పదిహేను రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ ని లాక్ డౌన్ ఎత్తేయగానే ఫర్మిషన్స్ తీసుకుని పెట్టేసుకోమని రవితేజ నిర్మాతలకు చెప్పారట.

అయితే ఇప్పుడున్న పరిస్దితిలో రిలీజ్ బాగా లేటు అయ్యేటట్లు ఉంది, షూటింగ్ పూర్తి చేసుకున్నా పెద్దగా కలిసొచ్చేదేముంది అన్న డిస్కషన్ వస్తే...ఎడిటింగ్ , రీరికార్డింగ్ వంటివన్ని ఫినిష్ చేసుకోవటానికి ఎలాగో టైమ్ పడుతుంది. ఈ లోగా థియోటర్స్ లో రిలీజ్ లు మొదలవుతాయి. మనం రిలీజ్ కు మొత్తం రెడీ చేసుకుంటే థియోటర్స్ చూసుకోవచ్చు అని చెప్పినట్లు సమాచారం. అలాగే థియోటర్స్ స్టార్ట్ అయ్యే సమయానికి పెద్ద సినిమాలు మార్కెట్ లో పెద్దగా ఉండవు. అది బిజినెస్ పరంగానూ ఎడ్వాంటేజ్ అవుతుందని లాజిక్ చెప్పినట్లు తెలుస్తోంది. రవితేజ ధైర్యం ఇవ్వటంతో నిర్మాతలు లాక్ డౌన్ తర్వాత షూట్ చేయటానికి కావాల్సిన పర్మిషన్స్  తీసుకోవటానికి రెడీ అవుతున్నారట. 

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న క్రాక్ చిత్రంలో రవితేజతో శృతిహాసన్ రొమాన్స్ చేయనుంది. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇంటెన్స్ స్టోరీతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చిత్రం టీమ్ చెబుతోంది. తమిళ నటులు సమద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిల్మ్ డివిజన్‌పై బి మధు నిర్మిస్తోన్న చిత్రానికి తమన్ సంగీతం, జికె విష్ణు సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.