Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ ‘భైరవద్వీపం’ ..రావి కొండలరావు రచనానుభవాలు

 చందమామ విజయా కంబైన్స్‌ నిర్మించిన జానపద చిత్రం 'భైరవద్వీపం'. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాససరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'భైరవద్వీపం' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జానపద హీరోగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఈ సినిమా కథ అందించింది రావి కొండలరావు గారు.  అప్పటికే పెళ్లి పుస్తకం చిత్రానికి కథ అందించిన అనుభవంతో ఆయన భైరవద్వీపానికి శ్రీకారం చుట్టారు. ఆ జ్ఞాపకాలు ఆయన ఓ సారి మీడియా వద్ద గుర్తు చేసుకున్నారు.

Ravi Kondala Rao remembers his Bhairavadvipam Days
Author
Hyderabad, First Published Jul 28, 2020, 7:12 PM IST

 చందమామ విజయా కంబైన్స్‌ నిర్మించిన జానపద చిత్రం 'భైరవద్వీపం'. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాససరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'భైరవద్వీపం' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జానపద హీరోగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఈ సినిమా కథ అందించింది రావి కొండలరావు గారు.  అప్పటికే పెళ్లి పుస్తకం చిత్రానికి కథ అందించిన అనుభవంతో ఆయన భైరవద్వీపానికి శ్రీకారం చుట్టారు. ఆ జ్ఞాపకాలు ఆయన ఓ సారి మీడియా వద్ద గుర్తు చేసుకున్నారు.

రావి కొండలరావు గారు మాట్లాడుతూ... ‘భైరవద్వీపం’ (’94). దర్శకులు సింగీతం శ్రీనివాసరావుతో కలసి ఆ చిత్రానికి కథ ఒక లైన్ అనుకొని, పాత్రలు వగైరా డెవలప్ చేస్తూ వచ్చా. నిజానికి, ఆ జానపద చిత్రానికి రచన చేయండంటూ ముళ్ళపూడి వెంకట రమణ గారి చుట్టూ తిరిగా. ఆయన తీరిక లేదన్నారు. తరువాత మరో ఇద్దరు, ముగ్గురు రచయితలను కూడా పెట్టాం. కానీ, వాళ్ళు మా ‘విజయ’ వారి క్రమశిక్షణకు తగ్గట్లుండేవారు కాదు. దాంతో, సన్నివేశాలు, పాత్రలకు రూపకల్పన చేసిన నన్నే రచన కూడా చేయమని దర్శక, నిర్మాతలు కోరారు. వాళ్ళ ప్రోద్బలంతో రాశా. ఆ చిత్రం విజయం సాధించి, నాకు అందరిలో పేరు తెచ్చింది. అదొక సాఫల్యం అంటారు.

 ఇక బాపు- రమణల ‘పెళ్ళి పుస్తకం’ (1991) చిత్రానికి కథ అందించాను. మా నాగిరెడ్డి గారి పిల్లలు ‘చందమామ - విజయ కంబైన్స్’ పతాకంపై చిత్ర నిర్మాణంలోకి దిగడంతో రాజేంద్రప్రసాద్ నటించిన ‘బృందావనం’ (’92)లో మళ్ళీ కలానికి పని చెప్పా. ఆ సినిమాకు స్క్రిప్టు నరసరాజు గారు. అంతా కలసి ఆఫీసులో కూర్చొని కథ అల్లుకొన్నాం. నేను నరసరాజు గారికి చేదోడు వాదోడు. అందులో, నాకూ, మా ఆవిడ రాధాకుమారికీ వేషాలున్నాయి. ‘నువ్వు - నీ శ్రీమతి ఉన్న సీన్లు నువ్వే రాసేసెయ్’ అని, ఆ బాధ్యత నాకు వదిలేశారాయన. ఆ సినిమా బాగా ఆడింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios