కరోనా ఎవరినీ వదిలిపెట్టేటట్లు కనపడటం లేదు. తాజాగా రేసు గుర్రం విలన్.. భోజ్‌పురి సూపర్ స్టార్ రవికిషన్ పర్సనల్ అసిస్టెంట్‌ గుడ్డూ పాండేకు కరోనా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.ఐతే.. రవికిషన్ మాత్రం ఆయనకు దూరంగానే ఉన్నాడు.

వివరాల్లోకి వెళితే...ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన భోజ్‌పురి సూపర్‌స్టార్, బీజేపీ ఎంపీ ర‌వికిష‌న్ పీఏకి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ర‌వికిష‌న్ ఖరారు చేశారు. త‌న ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్న 42 ఏళ్ల గుడ్డూ పాండే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. వైద్య పరీక్ష‌లు చేయ‌గా, అత‌నికి  క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అత‌ని‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. 

త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నాను అని  పేర్కొన్నారు ర‌వికిష‌న్. అయితే పాండేకి కరోనా సోకింద‌నే విష‌యం తెలిసిన వెంట‌నే ర‌వికిష‌న్‌తో పాటు అత‌నితో కాంటాక్ట్ అయిన వాళ్లు టెస్ట్‌లు చేయించుకోవ‌డంతో పాటు క్వారంటైన్‌కి వెళ్ళారు. ఇక గోరఖ్‌పూర్‌లో కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. ఇక్క‌డ ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించాల‌ని, బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలి. ఈ సంక్షోభంలో జాగ్ర‌త్త మాత్ర‌మే మ‌న‌కి ర‌క్ష‌ణ అని అంటున్నారు ర‌వికిష‌న్. 

‘రేసుగుర్రం’ సినిమాతో సౌత్‌కి పరిచయమయ్యారు భోజ్‌పురి స్టార్‌ రవికిషన్‌. తన నటనతో మెల్లిగా దక్షిణాది ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ప్రస్తుతం నాలుగు భోజ్‌పురి, ఒక హిందీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీవితంతో సినిమా చేయాలని ఉందని ఇటీవల రవికిషన్‌ పేర్కొన్నారు.