సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అయితే ఈ కొంత సమయంలో వారు ఒక ఇండస్ట్రీకి మాత్రం పరిమితం కావాలని అనుకోరు. సౌత్ లాంగ్వేజెస్ తో పాటు బాలీవుడ్ లో కూడా నటించాలని ఆరాటపడుతుంటారు. ఆ ప్లాన్లు వర్కవుట్ కాక ఉన్న క్రేజ్ ని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు.

ఇప్పుడు రష్మిక కూడా అదే తప్పు చేస్తోందని అంటున్నారు. తెలుగులో ఈమెకి స్టార్ హోదా లభించింది. మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో రష్మికని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ రష్మిక మాత్రం కోలీవుడ్ వైపు చూస్తోంది.

అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించాలనేది ఆమె ప్లాన్. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ లో కార్తితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత విజయ్ సరసన నటించాలని రష్మిక ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏ క్షణంలోనైనా విజయ్ సినిమాలో ఛాన్స్ వస్తుందనే ఆశతో తెలుగు సినిమాలకు కాల్షీట్లు ఇవ్వడం మానేసింది. 

రీసెంట్ గా కుర్ర హీరో రామ్ సరసన నటించే ఛాన్స్ వస్తే మేకర్లకు ఇది మాట చెప్పి ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం. మహేష్ సినిమాతో పాటు నితిన్ 'భీష్మ' సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకి క్రేజ్ ఉన్నప్పటికీ ఆమె మాత్రం కోలీవుడ్ లో స్టార్ హోదా దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. మరి ఆ రేంజ్ లో రష్మికకు ఎవరు బ్రేక్ ఇస్తార్లో చూడాలి!