మాజీ లవర్‌తో సినిమాకు రెడీ.. హింట్ ఇచ్చిన రష్మిక
సాండల్‌వుడ్‌లో కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో ఆ చిత్ర హీరోగా రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా ఘనంగా జరిగింది. కానీ కెరీర్ పరంగా బిజీ అవుతుండటంతో రక్షిత్‌లో పెట్టి క్యాన్సిల్ చేసుకుంది రష్మిక. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తాజాగా రక్షిత్‌తో కలిసి నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చింది రష్మిక.
ప్రజెంట్ టాలీవుడ్‌లో టాప్ పోజిషన్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ సాండల్ వుడ్ సూపర్ హిట్ మూవీ కిరిక్ పార్టీ సినిమాతో సక్సెస్ అయ్యింది. తరువాత ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇక్కడ కూడా వరుస విజయాలతో దూసుకుపోతోంది.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ వెంటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా పుష్పలో హీరోయిన్‌గా నటిస్తోంది రష్మిక మందన్న.
అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవటంతో ఇంటికే పరిమితమైంది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలతో ముచ్చటించిన ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సాండల్‌వుడ్‌లో కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో ఆ చిత్ర హీరోగా రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా ఘనంగా జరిగింది.
కానీ కెరీర్ పరంగా బిజీ అవుతుండటంతో రక్షిత్‌లో పెట్టి క్యాన్సిల్ చేసుకుంది రష్మిక. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తాజాగా రక్షిత్‌తో కలిసి నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. కిరిక్ పార్టీ సీక్వెల్‌లో నటించేందుకు రెడీ అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో రక్షిత్ శెట్టి ఒప్పుకుంటే కిరిక్ పార్టీ సీక్వెల్ తెర మీదకు రావటం కాయం అన్న టాక్ వినిపిస్తోంది.