మెగాస్టార్ చిరంజీవికు ఉన్న అనుభవం చాలా సార్లు చాలా సినిమాలు యావరేజ్ నుంచి సూపర్ హిట్ అవటానికి ఉపయోగపడ్డాయని ఆయనతో పనిచేసిన వారు చెప్పే మాట. ఆయనకు కమర్షియల్ లెక్కలు తెలుసు. సినిమా ఎడిటింగ్ లో కూర్చుంటే ఏది ఎంతవరకూ ఉండాలో..ఏది ఎక్కడ పెడితే ఏ స్దాయి రెస్పాన్స్ వస్తుందో అంచనా వేయగలరు. ఇప్పుడాయన తన అనుభవాన్ని తన తాజా చిత్రం ఆచార్య కాస్టింగ్ కు ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా యూత్ లో క్రేజ్ ఉన్న రష్మికను సీన్ లోకి తెచ్చినట్లు సమాచారం.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రష్మిక ను రామ్ చరణ్ సరసన అయితే బాగుంటుందని సూచించారట. ఈ సినిమాలో రామ్ చరణ్ సెకండాఫ్ లో వచ్చే పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రకు జోడిగా ఆమె కనిపించబోతున్నట్లు సమాచారం. స్టూడెంట్ లీడర్ గా రామ్ చరణ్ ...అతన్ని ఫాలో అయ్యి,ప్రేమలో పడే అమ్మాయిగా రష్మిక కనిపించబోతున్నారట. కొన్ని కాలేజీ సీన్స్ సైతం ఉండబోతున్నట్లు చెప్తున్నారు. అయితే అవి హీరోయిజం తో కాకుండా కొరటాల శివ స్టైల్ లో స్మూత్ గా ఉంటాయిట.
 
మొదట మహేష్ బాబుని ఈ పాత్రకు అనుకున్నారు. అయితే మహేష్ అడిగిన రెమ్యునేషన్ ఎక్కువ అనిపించటంతో మెగాస్టార్ సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుందని, తను హీరోగా వచ్చే సినిమాకు అంత అనవసరం అని చెప్పినట్లు చెప్తున్నారు. మహేష్ వంటి సూపర్ స్టార్ కు ఆ స్దాయి రెమ్యునేషన్ ఇవ్వాల్సిందే కానీ, తన సినిమా దాన్ని మోయలేదని ఖరా ఖండిగా చెప్పారట. ఇప్పుడు అక్కడ తగ్గించింది అంతా రష్మిక మీదా మిగతా వాటి మీద ఖర్చు పెడుతున్నారుట. ఇక మెగాస్టార్ ప్రక్కన త్రిషను అనుకున్నారు. కానీ ఆమె తనదైన కారణాలు చెప్పి తప్పుకున్న సంగతి తెలిసిందే.