అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌ కు వచ్చిన హాట్ బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే సూపర్‌ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది. సూపర్‌ స్టార్‌తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో జోడి కట్టిన ఈ బ్యూటీ మరో బ్లాక్‌ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న రష్మిక తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ ఆ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

తాజాగా ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది రష్మిక. తాను స్కూల్‌ డేస్‌లో ఉన్న సమయంలోనే ఓ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ మీద తన ఫోటో వచ్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుంది. ఆ మ్యాగజైన్ కవర్ పేజ్‌ మీద ఉన్న స్టిల్‌నే తాను పెట్టి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. 2001లో గోకులం అనే మ్యాగజైన్‌ కవర్ పేజీ మీద ఈ ఫోటో వచ్చిందని తెలిపింది. `ఈ ఫోటోను అమ్మ దాచుకుంది. ఇదొక్కటే కాదు ఏ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ మీద నా ఫోటో వచ్చినా దాన్ని అమ్మ ఇలాగే భద్రపరుస్తుంది` అంటూ కామెంట్ చేసింది రష్మిక.