Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ వర్కర్ గా పనిచేయడంలో తప్పేముంది

సెక్స్ వర్కర్ గా పనిచేయడంలో తప్పేముంది 

Rashmi says Nothing bad about playing a sex worker

మహిళలపై లైంగిక వేధింపులు ప్రతి చోటా జరుగుతున్నాయని, కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకుని ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేయడం ఆపాలని ప్రముఖ యాంకర్ - నటి రష్మీ గౌతమ్ కోరింది.  రీసెంట్ గా ఒక ట్వీట్ రిప్లై ఇస్తూ.. ఒకసారి వేదం సినిమా చూడండి. అందులో అనుష్క గొప్పగా నటించారు. అసలు సెక్స్ వర్కర్ రోల్ ప్లే చేస్తే తప్పేంలేదంటు.అది ఒక ఛాలెంజింగ్ రోల్ అంటు చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ‘క్యాస్టింగ్ కౌచ్’ పేరిట ఫిల్మ్ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం తగదని సూచించింది. ‘క్యాస్టింగ్ కౌచ్’ను ఓ అంశంగా చేస్తూ.. చౌకబారు సంతోషం పొందడం కన్నా ఈ దారుణాలు జరగకుండా ఆపేందుకు మన వంతు ప్రయత్నం చేద్దామని రష్మీ సూచించింది. కాగా, రష్మీ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios