హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామని, సినిమాల్లో వేషం ఇప్పిస్తామని ఆశ పెట్టి లైంగికంగా వాడుకునే కేసులు సినిమా పరిశ్రమలో కామన్ గా మారిపోయాయి. నెలకి ఒకటి అయినా ఏదో ఒక సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మీటూ వంటి పరవ్ ఫుల్ ఉద్యమం వచ్చినా దీనికి చెక్  పెట్టలేకపోతున్నారు. తాజాగా మళయాళ స్టార్ ప్రొడ్యూసర్ సైతం ఇలాంటి పరువు తక్కువ పని చేసి వార్తలకు ఎక్కారు. 

వివరాల్లోకి వెళితే...వైశాఖ్‌ సినిమా బ్యానర్‌పై ‘రోల్‌ మోడల్స్‌’, ‘చంక్స్‌’, ‘వెల్‌కమ్‌ టు సెంట్రల్‌ జైల్‌’ వంటి చిత్రాలను వైశాఖ్‌ రాజన్‌ నిర్మించారు. ఆయన సినిమాలు మంచి విజయం సాధించటంతో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరొచ్చింది. అయితే తాజాగా ఈ మలయాళ నిర్మాత పై ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన ఓ మోడల్‌ అక్కడి నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఆయన తను నిర్మించబోయే సినిమాలో  హీరోయిన్ గా అవకాశామిస్తానని మభ్య పెట్టి ఆడిషన్‌ అంటూ అతని గెస్ట్‌హౌస్‌కి పిలిపించి తనను బలవంతంగా అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్‌ 376 ప్రకారం వైశాఖ్‌ రాజన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎర్నాకుళం నార్త్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.