Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఆర్ఆర్‌ హీరోయిన్‌కు‌ బెదిరింపులు.. రేప్ చేస్తామంటూ!

సుశాంత్ ఆత్మహత్య వెనక ఆలియా భట్ ప్రమేయం ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోన్న నేపథ్యంలో ఆలియా భట్‌కు నెటిజన్లలో కొందరు బెదిరింపులకు దిగారు. వీటిపై అలియా భట్ సైలెంట్ గా ఉన్నా ఆమె సోదరి షహీన్ భట్ మాత్రం ఊరుకోలేదు. ఆ బెదిరింపులుకు చెందిన స్క్రీన్ షాట్స్ తీసి ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ చేసింది. వారిపై లీగల్ గా కేసులు పెడతామని చెప్పుకొచ్చింది.

Rape and death threats to Alia Bhatt
Author
Hyderabad, First Published Jul 15, 2020, 8:09 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సోషల్ మీడియాలో అరాచకం బాగా పెరిగిపోయింది. ఏదో ఒక ఇష్యూని అడ్డం పెట్టుకుని సెలబ్రెటీలను బెదిరించటం, అక్కసు వెళ్లబోసుకోవటం మరీ ఎక్కువైంది. గత కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో నెట్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. సినీ పరిశ్రమలో వారసత్వాన్ని ప్రోత్సహించేవారిపై సామాన్యులు సైతం మండిపడుతున్నారు. ముఖ్యంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉందని గట్టి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో  ఇవి మరీ ఎక్కువయ్యాయి.

అలాగే సుశాంత్ ఆత్మహత్య వెనక ఆలియా భట్ ప్రమేయం ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోన్న నేపథ్యంలో ఆలియా భట్‌కు నెటిజన్లలో కొందరు బెదిరింపులకు దిగారు. వీటిపై అలియా భట్ సైలెంట్ గా ఉన్నా ఆమె సోదరి షహీన్ భట్ మాత్రం ఊరుకోలేదు. ఆ బెదిరింపులుకు చెందిన స్క్రీన్ షాట్స్ తీసి ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ చేసింది. వారిపై లీగల్ గా కేసులు పెడతామని చెప్పుకొచ్చింది.

అలాగే సోషల్ మీడియాలో ఆలియా భట్‌‌ను ఫాలో అవుతున్న వారు సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో వీరిని అన్ ఫాలో చేస్తున్నారు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఆలియా భట్‌కు నెటిజన్లు షాక్ ఇచ్చారు. ఆమె తక్కువ వ్యవధిలోనే 5 లక్షల మంది ఫాలోవర్స్ కోల్పోయింది. 
 
ఇక అలియాభట్ విషయానికి వస్తే...టాలీవుడ్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమాలలో 'ఆర్ ఆర్ ఆర్' ఒకటి. దర్శక ధీరుడు  ఎస్ ఎస్ రాజమౌళి భారీఎత్తున చాలా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇండిపెండెన్స్ కు  ముందు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీంల జీవిత కథలను ఎంచుకొని సినిమాగా మలుస్తున్నారు జక్కన్న. ఇప్పటికే 70శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా చేస్తోంది.  

అలాగే చారిత్రక చిత్రాలను తెరక్కెక్కించే సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో అలియా లీడ్ పాత్ర చేస్తోంది.సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వంలో “గంగు భాయ్ కతియవాది” అనే రియల్ లైఫ్ బయో పిక్ చిత్రాన్ని ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను కూడా ప్రారంభించిన ఈ చిత్రం లాక్ డౌన్ వలన నిలిచిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ అనంతరం బాలీవుడ్ లో షూటింగ్ మొదలు కానున్న మొదటి చిత్రం ఇదే అని తెలుస్తుంది.

‘గంగూ భాయ్ కతియావాడి’ అనే టైటిల్ తో తెరక్కెక్కుతున్న ఈ మూవీ ముంబయి రెడ్ లైట్ ఏరియాలో కామాటిపురాకు సంబంధించిన కథ. ఆ ప్రాంతంలో గంగూబాయి అనే ఆవిడ తన చిన్న తనంలోనే వ్యభిచార కూపంలో కూరుకుపోయింది. దాంతో ఆమె అక్కడే వ్యభిచార గృహాలను నడుపుతూ రౌడీరాణిగా ఎదిగింది. ఈ వివరాలు అన్నీ ఈ మూవీలో ఇవి చూపించనున్నారు. నిజానికి ఈ మూవీలో అలియా ప్లేస్ లో ప్రియాంక చోప్రా చేయాల్సివుంది కానీ చివరి నిమిషంలో అలియా చేస్తుంది. ఇక ఈమూవీ 2020 సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడది సాధ్యమయ్యే పనికాదు. రిలీజ్ బాగా లేటు కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios