పోర్న్ స్టార్ తో కలిసి నటించిన రణ్వీర్ సింగ్.. శృంగార సమస్యలపై యాడ్, వీడియో ఇలా ఉందేంటి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చేసే చిత్ర విచిత్రాలు అన్నీఇన్నీ కావు. బోల్డ్ గా ఎంతకైనా తెగిస్తాడు ఈ హీరో. ఆ మధ్యన న్యూడ్ గా ఫోటో షూట్ చేసి అందరిని షాక్ కి గురిచేసాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చేసే చిత్ర విచిత్రాలు అన్నీఇన్నీ కావు. బోల్డ్ గా ఎంతకైనా తెగిస్తాడు ఈ హీరో. ఆ మధ్యన న్యూడ్ గా ఫోటో షూట్ చేసి అందరిని షాక్ కి గురిచేసాడు. దీపికా పదుకొనెతో ప్రేమ ఆ తర్వాత పెళ్లి ఇలా రణ్వీర్ సినిమాల కంటే ఇతర విషయాలతో వార్తల్లో ఉంటున్నాడు.
కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా రణ్వీర్ సింగ్ టాప్ లో దూసుకుపోతున్నాడు. వాణిజ్య ప్రకటనల ద్వారా రణ్వీర్ సింగ్ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఈ రేంజ్ లో రణ్వీర్ హవా కొనసాగుతోంది. ఇదంతా ఒకెత్తయితే రణ్వీర్ సింగ్ తాజాగా ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు.
ఏకంగా పోర్న్ స్టార్ తో కలసి నటించాడు. ఇంతకీ ఆ పోర్న్ స్టార్ ఎవరు ? ఆమె పేరు ఏంటి అనే సందేహాలు రావచ్చు. అయితే ఇక్కడ రణ్వీర్ సింగ్ నటించింది మహిళతో కాదు.. పురుషుడితో. పోర్న్ స్టార్ గా రాణిస్తున్న జానీ సిన్స్ తో కలసి రణ్వీర్ సింగ్ ఒక యాడ్ లో నటించారు.
ఈ యాడ్ కూడా విడుదలై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫాన్స్ అయితే బాబోయ్ ఇదేంటి ఇది.. ఇలా ఉంది అంటూ గగ్గోలు పెడుతున్నారు. రణ్వీర్, జానీ సిన్స్ కలసి శృంగార పరమైన సమస్యలకి సంబంధించిన యాడ్ షూట్ చేశారు. పురుషులలో శృంగార సమస్యలని దూరం చేసే కాప్స్యూల్ కి సంబందించిన యాడ్ అది. బోల్డ్ కేర్ అనే కాప్స్యూల్ కోసం రణ్వీర్ సింగ్, జానీ సిన్స్ నటించారు.
ఈ యాడ్ మొత్తం ఇండియన్ స్టైల్ లో చిత్రీకరించబడింది. ఈ యాడ్ లో ఉన్న సన్నివేశాలు చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే. రణ్వీర్ సింగ్, జానీ సిన్స్ ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములుగా ఉంటారు. రణ్వీర్ సింగ్.. జానీ సిన్స్ కి అన్నగా నటిస్తున్నాడు. అయితే జానీ సిన్స్ భార్య తన భర్తని వదిలేసి వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది. రణ్వీర్ సింగ్ వచ్చి ఏమైంది అని ప్రశ్నించగా తన భర్త శృంగార లోపం గురించి చెబుతుంది.
పెద్ద డ్రామా జరిగిన తర్వాత రణ్వీర్ సింగ్.. తన సోదరుడికి బోల్డ్ కేర్ కాప్స్యూల్ ఇస్తాడు. దీనితో జానీ సిన్స్ భార్య తిరిగి భర్తతో సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు బాబోయ్ ఇలా ఉందేంటి అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.