Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళికే నో చెప్పిన రన్బీర్ కపూర్.? సందీప్ వంగ డ్రగ్ లా ఎక్కేశాడా.!

బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ ‘యానిమల్’తో మాసీవ్ సక్సెస్ ను అందుకున్నారు. ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ తో ఖుషీ అవుతున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళితో రన్బీర్ అన్న మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా మారాయి. 
 

Ranbir Kapoor Refuses Rajamoulis Offer Shocking Comments NSK
Author
First Published Dec 7, 2023, 12:05 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) 'యానిమల్' (Animal The Film)  థియేటర్లలో దుమ్ములేపుతోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఓవైపు విమర్శలు వచ్చినా ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతుండటంతో అవన్నీ తుడుచుకుపోతున్నాయి. ఆడియెన్స్ ఈ చిత్రానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీంతో స్పెషల్ షోను కూడా ముంబైలో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం మొదటి వారానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఐదు రోజుల్లో రూ.450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి రిజల్ట్ కనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే.. యానిమల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నారు. ఈ క్రమంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli)తో రన్బీకపూర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వేదికపైనే రాజమౌళి ఆఫర్ ను రన్బీర్ తిరస్కరించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంజరిగిందంటే.. ప్రీ రిలీజ్ వేడుకపై రాజమౌళి మాట్లాడుతూ రన్బీర్ ను, సందీప్ రెడ్డి వంగ, యానిమల్ చిత్రాన్ని ప్రశంసించారు. 

ఈ క్రమంలో ఇప్పుడు నువ్వు సినిమా చేయాల్సి వస్తే.. నాతో చేస్తావా? సందీప్ తో చేస్తావా? అని చిక్కు ప్రశ్న అడిగాడు. దీంతో రన్బీర్ సమాధానం చెప్పేందుకు సందేహించాడు. ఇద్దరుతో చేస్తానని బదులివ్వగా.. లేదు ఒక్కరికే ఎంచుకో అని చెప్తాడు. ఇందుకు రన్బీర్ మాత్రం సందీప్ కే ఓకే చెబుతాను సార్. ప్రస్తుతం నాకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నిజాయితీగా ఉండటం ముఖ్యం అని బదులిచ్చాడు. రన్బీర్ ఆన్సర్ కు రాజమౌళి కూడా మెచ్చుకున్నాడు. కానీ అంత పెద్ద ఈవెంట్ లో అగ్రదర్శకుడు రాజమౌళి ఆఫర్ ను కాదనం కాస్తా ఆసక్తికరంగా మారింది.

ఇక రన్బీర్ ‘బ్రహ్మస్త్రం’ చిత్రాన్ని రాజమౌళి సమర్పకులుగా ఉండి సౌత్ లో బాగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ‘యానిమల్’కు కూడా జక్కన్న మద్దతుగా నిలిచారు. కొన్ని సందర్భాల్లో రన్బీర్ రాజమౌళితో చాలా మర్యాదగా మెదలడం, వేదికపై రాజమౌళి రన్బీర్ కు ఆఫర్ ఇవ్వడం చూస్తుంటే.. ఫ్యూచర్ లో ఏదైనా మ్యాజిక్ ఉండనుందా? అనేది సందేహంగా మారింది. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు SSMB29తో బిజీగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios