బాహుబలి చిత్రంలో రానా భల్లాల దేవుడిగా అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. బాహుబలితో పాటు ఘాజి చిత్రం కూడా రానాని దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. 

ఇదిలా ఉండగా ఇటీవల రానా ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలని ఖండిస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని రానా క్లారిటీ ఇచ్చాడు కూడా. కొంతకాలంగా రానా యుఎస్ లో ఉంటున్నాడు. 

తాజాగా రానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. ఈ ఫొటోలో రానా మరింత సన్నగా మారి కనిపిస్తున్నాడు. ఈ స్థాయిలో రానా వెయిట్ లాస్ ఎందుకవుతున్నాడనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. 

ప్రస్తుతం రానా విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. రానా ప్రధానపాత్రలో హిరణ్యకశ్యప అనే పౌరాణిక చిత్రానికి కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి.