క‌రోనా వైర‌స్ మీద నెల‌కొన్న భ‌యాందోళ‌న‌ల కార‌ణంగా సినిమా స‌హా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీ మొత్తం కార్య‌క‌లాపాల్ని నిలిపి వేయ‌డంతో, ప్ర‌జ‌లు ఇళ్ల‌ల్లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు.  స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. గంటలు గంటలు ఇంట్లోనే గడుపుతుండటంతో వాళ్లకు కూడా బోర్ కొడుతుంది. ఈ నేపధ్యంలో హీరో దగ్గుపాటి రానా తన సొంత యాప్స్ లో ఉన్న కంటెంట్ ని ప్రీ గా చూడవచ్చని ప్రకటన చేసారు. అయితే ఈ ప్రకటన చూసిన కొందరు సోషల్ మీడియాలో ..టైమ్ చూసి రానా తన యాప్స్ ని ప్రచారం చేసుకుందామని చూస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే...

హీరో రానా దగ్గుబాటి రెండు కామిక్ యాప్స్‌ను నడుపుతున్నారు. ఈ యాప్స్‌ను ఇప్పుడు ఉచితంగా అందించబోతున్నారు. కరోనా వైరస్ శెలవలు  నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజ‌ల‌కు ఒక చ‌క్కని కానుక‌ను ఆఫ‌ర్ చేశారు. ఒక నెల రోజుల పాటు ఏసీకే (అమ‌ర్ చిత్ర క‌థ‌), టింకిల్ యాప్స్‌లోని కంటెంట్‌ను ఉచితంగా చూడవ‌చ్చని ప్రక‌టించారు. ఆ రెండు యాప్స్ ఆయ‌న‌వే. ఇవి కామిక్స్ యాప్స్. పిల్లలు బాగా ఇష్టపడతారు.
 
రానా మాట్లాడుతూ...‘‘ఏసీకే విష‌యంలో ఈ నెల‌లో ఆన్‌లైన్ స‌భ్యత్వాల‌ను మొద‌లుపెట్టాల‌ని నిర్ణయించుకున్నాం. కాబ‌ట్టి ఏసీకే, టింకిల్ యాప్స్‌లోని అద్భుత‌మైన కంటెంట్‌ను పిల్లలు, పెద్దలు ఉచితంగా చూసుకోవ‌చ్చు. వాటిలో త‌మ‌కు ఇష్టమైన దాన్ని చ‌దువుకోవ‌చ్చు. అందులో ఉన్నవ‌న్నీ మ‌న ప్రాంతం క‌థ‌లు. అవి చ‌దివితే మ‌న దేశం, మ‌న దేవుళ్లు, రాజులు, సంస్కృతి గురించి తెలుస్తుంది. చ‌క్కని బొమ్మలు, క‌థ‌ల‌తో అవి అల‌రిస్తాయి. మ‌న గ‌తం గురించి తెలుసుకొని, భ‌విష్యత్తును నిర్మించుకోవ‌డానికి నేటి త‌రానికి ఇది చాలా ముఖ్యం’’ అని రానా చెప్పారు. 

ఫ్రీగా ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే ఇన్నాళ్లూ ఆగటం ఎందుకు. కరెక్ట్ గా కరోనా విజృంభిస్తున్న సమయం ఎందుకుని విమర్శిస్తున్నారు. అయితే  ఇందులో ప్రపంచానికి కానీ, పిల్లలకు కానీ, ప్రజలకు కానీ వచ్చే నష్టం ఏమీ లేదనేది నిజం. ఈ నెల ఫ్రీగా చూసి వచ్చే నెల ఇష్టం ఉంటే డబ్బులు కట్టి కంటిన్యూ అవుతారు లేకపోతే లేదు.ప్రతీదానికి విమర్శలు చేస్తూ పోతూ ప్రతీ పనిలోనూ తప్పులే కనపడతాయి.