Asianet News TeluguAsianet News Telugu

రానా ఎవరి మాటా వినడు... సురేష్ బాబు ఆసక్తికర కామెంట్స్

కెరీర్ బిగినింగ్ నుండి రానా భిన్నమైన చిత్రాలు, భిన్నమైన పాత్రలు చేశారు. అరంగేట్రం లోనే హిందీలో చిత్రాలు చేశారు. బాహుబలి, అరణ్య, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి చిత్రాలలో రానా ఛాలెంజింగ్ రోల్స్ చేశారు. త్వరలో విడుదల కాబోతున్న విరాటపర్వం కూడా ప్రయోగాత్మక చిత్రం అని చెప్పవచ్చు.

rana never listen anybody producer suresh babu interesting comments ksr
Author
Hyderabad, First Published Jul 18, 2021, 1:13 PM IST


విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ నారప్ప విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ లో నేరుగా జులై 20నుండి స్ట్రీమ్ కానుంది. నారప్ప సినిమా థియేటర్స్ లో విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. అయితే పరిస్థితుల కారణంగా ఓటిటి విడుదల తప్పడం లేదని, వెంకటేష్ ఫ్యాన్స్ కి విన్నవించుకున్నాడు. విడుదలకు రెండు రోజుల సమయం మాత్రమే వుండగా, చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ జోరు పెంచారు. 


నారప్ప నిర్మాతగా ఉన్న డి సురేష్ బాబు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల ఎంపిక విషయంలో రానా తీరు ఎలా ఉంటుందని అడుగగా.. రానా అసలు ఎవరి మాట వినడని ఆయన కుండబద్దలు కొట్టారు. సినిమా కావచ్చు, మరొకటి కావచ్చు రానా చేసే ప్రతి పని వెనుక నిర్ణయం అతనిదే అన్నారు. జనరల్ గా పరిశ్రమ గురించి ఏదైనా సలహా ఇస్తానే కానీ, సినిమాల ఎంపిక విషయంలో నా ప్రమేయం ఉండదని అన్నారు. 


కెరీర్ బిగినింగ్ నుండి రానా భిన్నమైన చిత్రాలు, భిన్నమైన పాత్రలు చేశారు. అరంగేట్రం లోనే హిందీలో చిత్రాలు చేశారు. బాహుబలి, అరణ్య, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి చిత్రాలలో రానా ఛాలెంజింగ్ రోల్స్ చేశారు. త్వరలో విడుదల కాబోతున్న విరాటపర్వం కూడా ప్రయోగాత్మక చిత్రం అని చెప్పవచ్చు. ఇక రానా తమ్ముడు అభిరామ్ వెండితెర ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన ఉందంటూ సురేష్ బాబు తెలియజేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios