వివాదాస్పద చిత్రాలతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా పోర్న్ స్టార్ మియా మల్కోవాతో తెరకెక్కించిన చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. ఈ  చిత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారటమే కాక... సెక్స్ పట్ల సమాజం దృక్పథతంలో మార్పు రావాలంటూ పెద్దయెత్తున చర్చ లేవనెత్తింది జీఎస్టీ. ఈ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రానికి విశేష జనాధరణ లభించటంతో పలు మీడియా సంస్థలు దీనిపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

 

తాజాగా ఈ చిత్రంపై, రామ్ గోపాల్ వర్మ దృక్పథంపై ఓ చర్చాకార్యక్రమం జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో పలువురు యువతులు, యువకులు పాల్గొన్నారు. సెక్స్ అంశంపై సుదీర్ఘంగా ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొందరు అఢిగిన ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానమిచ్చారు. వోడ్కా బ్యాన్ చేస్తే దేశంలో వుంటారా అని అడిగితే.. నేను వోడ్కకా కోసం దేశం వెళ్లాల్సినంత అవసరం లేదనుకుంటానన్నారు. అయితే పోర్న్ ఇండియాలో బ్యాన్ చేస్తే అంటూ ఓ యువతి ప్రశ్నించగా పోర్న్ నిషేధిస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశం విడిచి వెళ్తానని వర్మ సంచలన సమాధానం ఇచ్చారు.