సంతలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూనే వుంటారు. ఓ పక్క పోలీసు విచారణ ఎదుర్కొంటూనే.. మరోపక్క మరో వివాదానికి తెరతీశారు. శనివారం రాత్రి పవన్ కళ్యాణ్‌ను పోర్న్ మూవీతో పోల్చుతూ వరుసగా ట్వీట్లు చేశారు. అంతేగాక పవన్ ఇష్టమా? పోర్న్ ఇష్టమా అంటూ ట్విట్టర్లో ఏకంగా పోల్ నిర్వహించారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఆర్జీవీ తాజా ట్వీట్లు చూస్తుంటే.. కత్తి మహేష్ పాత్రను ఈసారి ఆర్జీవీ పోషిస్తున్నారేమో అనే అనుమానం కలగక మానదు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటూనే ‘పోర్న్’తో పోల్చడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

‘‘నాకు పోర్న్ అంటే ఎంత ఇష్టమో.. పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇష్టం. అందుకే నాకు ఆయన ‘పోర్న్ కళ్యాణ్’. అది ‘గాడ్ సెక్స్ ట్రూత్’ అంత నిజం’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. మరో గంట తర్వాత.. ‘‘పోర్న్‌కు, పవన్‌కు ఉన్న అత్యంత పాపులారిటీ నేపథ్యంలో.. ‘పోర్న్ కళ్యాణ్’ అల్టిటిమేట్ బ్రాండ్ అని భావిస్తున్నా. నేను వ్యక్తిగతంగా పోర్న్, పవన్‌లను అసమానంగా, సమానంగా ఇష్టపడుతున్నా’’ అని పోస్ట్ చేశారు. తర్వాతి ట్వీట్‌లో ఏకంగా పోర్న్ ఇష్టమా, పవన్ ఇష్టమా అంటూ పోల్ నిర్వహించారు.

ఆదివారం ఉదయం చేసిన మరో ట్వీట్‌లో ‘‘పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో ప్రజలకు దారిచూపే అద్భుతమైన ఆశాజ్యోతి అవుతుందని నేను నమ్ముతున్నా’’ అనే పాజిటివ్ ట్వీట్‌తో అభిమానుల్లో జోష్ నింపారు వర్మ.