Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ ను మెగాస్టార్ తో పోలుస్తూ వర్మ సంచలన ఫోటోలు వైరల్

  • రేవంత్ కాంగ్రెస్ చేరికపై వీలైనంతగా స్పందిస్తున్న వర్మ
  • రేవంత్ ను బాహుబలితో పోల్చిన వర్మ తాజాగా మరో సంచలనం
  • మెగాస్టార్ చిరంజీవి ఖైదీ పోస్టర్ లో రేవంత్ తో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన వర్మ
ramgopal varma sensational post on revanth reddy

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక వివాదం చుట్టూ తిరుగుతుంటాడు. దేనిపై ఎలా స్పందిస్తే  ఏమవుతుంది అనేది వర్మకు తెలిసినంతగా ఇండస్ట్రీలో మరెవ్వరికీ తెలియదు. అందుకే వర్మ తన సినిమాలకు ఈ వివాదాలనే పెట్టుబడిగా పెట్టి ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తాడు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసే రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన రేవంత్ రెడ్డి పార్టీ మారటంపై తన స్టైల్లో స్పందించాడు. ఇటీవల రేవంత్‌ను బాహుబలితో పోల్చిన వర్మ తాజాగా మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశాడు.

 

బాహుబలి లాంటి రేవంత్ చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాలతాయని అన్నారు. టీడీపీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పేసిన రేవంత్‌ను ఆకాశానికెత్తేస్తూ.. రెండు పోస్టర్లను ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. వీటిలో మెగాస్టార్ ఖైదీ నెం.150 పోస్టర్లకు రేవంత్ రెడ్డి ఫేస్‌ను తగిలించి వీటికి 'రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్' అనే టైటిల్ పెట్టి.. బాస్ ఈజ్ హియర్ అనే ట్యాగ్ లైన్‌తో ఫేస్ బుక్‌లో వదిలాడు. ప్రస్తుతం ఈ ఫోటోలపై కొంత మంది నెటిజన్లు మండి పడుతుండగా మరికొంత మంది వర్మ క్రియేటివిటీకి తెగ సంబరపడిపోతున్నారు. మొత్తానికి నిన్న బాహుబలితో నేడు చిరంజీవి ఖైదీ పోస్టర్‌లతో రేవంత్‌కు ఫుల్ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్న వర్మ సినీ సర్కిల్‌నేనే కాకుండా పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిగ్‌గా మారారు.

Follow Us:
Download App:
  • android
  • ios