Asianet News TeluguAsianet News Telugu

వర్మ సంచలన నిర్ణయం.. చలం ‘మైదానం’ ఆధారంగా మరో సెక్స్ సినిమా

  • సంచలనాలకు మారుపేరుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
  • వర్మ తాజా చిత్రం జీఎస్టీపై రేగిన దుమారం
  • తాజాగా మహిళను గౌరవిస్తూ మరో సెక్స్ మూవీకి సిద్ధమవుతున్న వర్మ?
ramgopal varma sensational decision to make another sex movie

జి.ఎస్.టి (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ) సినిమా తీసి తెలుగు రాష్ట్రాల మహిళా సంఘాలకు ఆగ్రహం తెప్పించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవి) ఈ సారి   మరొక సంచలనం సృష్టించబోతున్నారు. ఈ మధ్య,  రామ్ గోపాల్ వర్మ ను అరెస్టు చేయాలని, అతగాడు అశ్లీలంగా స్త్రీని చిత్రిస్తూ మియా మాల్కోవా ను అడ్డుపెట్టుకుని జిఎస్ టి తీశాడని మహిళా సంఘాలు గొడవ చేసిన సంగతి తెలిసిందే. వర్మను అరెస్టు చేయాలని, కేసుల్లో ఇరికించాలని, పిచ్చి పిచ్చిగా బుద్ధి చెప్పాలని మహిళా సంఘాల వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. వర్మ సినిమా కబుర్ల లాగా, వర్మటీట్లలాగా వర్మ  హైదరాబాద్ సిసిఎస్ కు రావడం పోవడం కూడా బాగా వైరలయింది. ఎంత తిట్టుకున్నా, తెలుగు కుర్రోళ్ల తెగ ఫాలో అయ్యే  సినిమా పర్సనాలిటీల్లో వర్మ ఒకరు. వర్మ అల్లాటప్పడైరెక్టర్ కాదు, ఫిల్మ స్టడీస్ అధ్యయనం చేసినోడు,గతంలో ఇపి డబ్ల్యు లాంటి పేరున్న జర్నల్స్ లో  కూడా వ్యాసాలు రాసినోడు. వర్మ సెక్స్ కబుర్లు మాట్లాడతాడనో, నోరంతా కంపు అనో చీదరించుకునే వాళ్లు ఉండవచ్చు. ఏమరేమనుకున్నా వర్మ అట్రాక్షన్ అంత ఈజీ గా తుడిచిపెట్టుకుపోదు. ఆ మాటకొస్తే, జిఎస్ టి ని యూట్యూబ్ ఆన్ చేసి పూర్తి గా చూడనోళ్లు, ఈసడించుకుని ఆఫ్ చేసినోళ్లు  బహుతక్కువ అని ఆ మధ్య ఏదో బ్లాగులో రాశారు. స్మార్ట్ ఫోన్ ఉన్నోళ్లంతా జిఎస్టిని చూసుంటారని, సాంతం చూశాకే, కొొందరికి వర్మ డర్టీగా కనిపించాడని  చెబుతారు.

 

సెక్స్ చుట్టు, స్త్రీత్వం చుట్టు మనం దట్టంగా కట్టుకుని జాగ్రత్తగా  కాపాడుకుంటున్న తెరలను వర్మ తొలగించడం మనకు జిఎస్ టి లో కనబడుతుంది.  అందుకే అది పచ్చిబూతులా గా కనిపించింది. అసహ్యమేస్తుంది.ఏవగింపు కల్గిస్తుంది. దానికి తోడు వర్మకు పదిపన్నెండు పెగ్గుల ఆరోగాన్స్ కూడా చచ్చింది. దానితో వర్మని అభిమానించడం గృహస్థులకు కష్టం.

 

అసలు విషయమేమిటంటే, తనను కేసు పాలుచేసినోళ్లకు, తనను ఛీ కొట్టిన వాళ్లకు సమాధానం చెప్పేందుకు వర్మ పూనుకుంటున్నట్లు ఆయనకు తెలిసినాయన ఒకరు చెప్పారు. ఈ సారి వెబ్ మూవీ కి ఆయన ఇంకా హాటాట్ సబ్జక్టు ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ సారి ఆయన తన విమర్శకులను ఇంకా కయ్యానికి కవ్విస్తున్నాడో,    వియ్యమొందాలనుకుంటున్నాడో తెలియదు గాని, ప్రఖ్యాత స్త్రీవాద రచయిత , స్త్రీ స్వేఛ్చ గురించి ఆలోచనా విప్లవం తీసుకొచ్చిన చలం నవల ‘మైదానం’ ఎంచుకున్నట్లు  తెలిసింది. చలం నవల 1927లో వచ్చింది. మైదానం సబ్జక్టును వర్మ అధ్యయనం చేస్తున్నారని తెలిసింది. ‘ఇన్ ప్రిన్సిపుల్ ఆయన మైదానం సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు, 2019లోనే అది వస్తుంది. అది విప్లవాత్మకంగా ఉంటుంది,’ అని ఆయన అన్నారు.

 

ఇక మైదానం విషయానికి వద్దాం.  మైదానంలో తన తగిన సరుకుంతా ఉందని వర్మ భావిస్తున్నాడట. కథ చాలా సింపుల్. రాజేశ్వరి అనే ఆమె ఒక బ్రాహ్మణ  లాయర్ భార్య. అయితే,  లాయర్ ఇల్లు, సంప్రదాయాలకు, తన శారీరకావసరాలకు మధ్య భయంకరమయిన కాన్ ఫ్లిక్ట్ లో రాజేశ్వరి ఇరుక్కుపోతుంది. చివరకు అమీర్ అనే దూదేకుల పురుషుడితో ఆమె లేచిపోతుంది. అమీర్ దగ్గిర హద్దుల్లేని ప్రేమ తప్ప మరొక మెటీరియల్ ప్రపంచం లేదు. అయినా సరే రాజేశ్వరి అమీర్ తో ముద్దులు పోతుంది, సుద్దులు చెప్పుతూ ఎన్నో వెన్నెల రాత్రులు గడుపుతుంది. లాయర్ గారి ఇంటి జైలు కంటే, మైదానంలాంటిపేదరికం  బాగుందని పిస్తుంది. ఒక స్త్రీ జీవితంలో శారీరక సుఖమనేది ఎంత కీలక పాత్ర వహిస్తుందో చలం చాలా చాలా గొప్పగా  రాజేశ్వరితో చెప్పించాడు. కుటుంబం,సంప్రదాయలు, పవిత్ర దాంపత్య బంధం, సమాజంలో లాయర్ కు ఉన్న హోదా అని ఒక స్త్రీ స్వేఛ్చగా తనకు ఇష్టమొచ్చినట్లుగా ఉండగానికి ఎంత అడ్డంకో ఈ నవలలో చలం చూపిస్తాడు. తిండి, బట్ట, ఇల్లు లేకపోయినా అమీర్ పొందు చాలాని రాజేశ్వరి హృదయం భూనభోంతరాలు దద్దరిల్లేలా చెబుతుంది. అందుకే 9 దశాబ్దాలు గడిచినా ఈ చిన్న నవల ఇప్పటికీ మేటి నవలగా చదువుతూ ఉంటారు.

 

సరిగ్గా ఈ కారణంతోనే వర్మ ఈ సారి ‘మైదానం’ లోకి ప్రవేశించానులకుంటున్న ఆయన సన్నిహితులొకరు చెప్పారు. ఈ విషయం మీద  మరిన్ని వివరాల కోసం వర్మతో మాట్లాడేందుకు మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏమైనా, మైదానం వర్మ సృష్టించే మరొక సెన్సేషన్ కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios