Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ ను చట్టబద్ధం చేయండి- వర్మ సంచలన కమెంట్

  • డ్రగ్స్ కేసు విచారణపై తీవ్రంగా మండిపడుతున్న వర్మ
  • కేవలం సినిమా పరిశశ్రమను టార్గెట్ చేశారని విమర్శలు
  • ఆల్కహాల్ తరహాలో డ్రగ్స్ చట్టబద్దం చేస్తే ఆదాయం వస్తుందన్న వర్మ
ramgopal varma seeks government to allow drugs legally

టాలీవుడ్ ను, తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాక మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.  ఇప్పటికే పూరి,చార్మి, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, శ్యాంకె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్ సిట్ ముందు హాజరు కాగా రేపు రవితేజ విచారణకు హాజరు కానున్నారు.  ఇక డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ పై ఫోకస్ చేయడంపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ నేరుగా ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ నే టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అకున్ తో బాహుబలి 3 సినిమా తీయాలంటూ కమెంట్స్ చేసిన వర్మ తాజాగా మరో సంచలనానికి తెరలేపారు.

 

తనకు ఏదైనా ఎక్స్ ప్రెస్ చేసే హక్కుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తరచూ వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ ఈ సారి  డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై మరోసారి విరుచుకు పడ్డాడు.   డ్రగ్స్ విచారణ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమందిని విచారిస్తున్న తీరుతో మొత్తం తెలంగాణా ప్రతిష్టకే భంగం కలిగిందని విమర్శించాడు. పంజాబ్ స్కూల్స్‌లో జరుగుతున్నట్లుగానే తెలంగాణ, హైదరాబాద్ స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారం జరుగుతోందని  దేశవ్యాప్తంగా భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా మంచి పరిపాలన అందిస్తున్నారని వున్న పేరు కూడా దెబ్బతింటోందని వర్మ ఆరోపించారు.

 

ప్రస్తుతం డ్రగ్స్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉందని అన్నారు. మరో వైపు వర్మ డ్రగ్స్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని వర్మ తప్పుపట్టాడు.  అంతే కాదు సిగరెట్‌, ఆల్కహాల్‌లాగానే డ్రగ్స్‌ను కూడా చట్టబద్ధం చేస్తే తప్పేంటి అని సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు. సిగరెట్, ఆల్కహాల్ లాగా డ్రగ్స్ ను చట్టబద్దం చేస్తే.. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో.. గమనించాలని వర్మ అంటున్నారు.  ఆల్కహాల్, సిగరెట్ లను ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వం డ్రగ్స్‌ను మాత్రం చట్టవిరుద్ధంగా ఎందుకు చూస్తోంది. డ్రగ్స్‌ను కూడా చట్టబద్ధం చేయవచ్చు కదా అంటూ వర్మ తీవ్ర స్థాయిలో కమెంట్స్ పోస్ట్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios