సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో... సంచలనం సృష్టిస్తున్నాడు. కడప ట్రైలర్ తర్వాత ఓ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీని పోర్న్ స్టార్ మియా మల్కోవాతో తెరకెక్కించాడు వర్మ.

 

పాతికేళ్ళ అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా అంటే.. పోర్న్ ప్రపంచంలో చాలా పాపులర్. అమ్మడు ఇప్పటికే కొన్ని వందల పోర్న్ సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఒక మామూలు ఫీచర్ ఫిలింలో నటించాలనే కోరిక పుట్టిందట. అందుకే సన్నీ లియోని తరహాలో ఆమె కూడా ఇండియన్ వెండితెరపై మెరవాలని అనుకుంటోంది. అందుకోసం రామ్ గోపాల్ వర్మను ఎంచుకుని.. ఒక షార్ట్ ఫిలిం కూడా చేసింది. ''గాడ్ సెక్స్ అండ్ త్రూత్'' పేరుతో ఇప్పుడు వర్మ ఈమెను పెట్టి ఒక లఘు చిత్రం తీశాడట. పోర్న్ స్టార్ కాబట్టి.. ఆ సినిమాలో కూడా ఆమెను న్యూడ్ గానే చూపించేశాడు వర్మ. పైగా ఆమె న్యూడ్ గా సోఫాపై కూర్చుని ఉండగా.. ఆమెను డైరక్ట్ చేస్తున్నట్లు ఒక ఫోటోగ్రాఫ్ తీయగా.. దానితో ఇప్పుడు ఒక డమ్మీ పోస్టర్ తరహాలో ఒకటి క్రియేట్ చేసి రిలీజ్ చేశాడు వర్మ. మొత్తానికి పోర్న్ స్టార్ తో సినిమా చేయాలనే కల వర్మ ఈ తరహాలో తీర్చుకున్నట్లున్నాడు.

 

ఈ ఫిలింను యురోప్ లో షూట్ చేశారని.. ఇందులో నటించడంతో తన జీవితం ధన్యమైందని, భారతీయ దర్శకుడితో మూవీ చాలా గొప్ప విషయమని మియా మాల్కోవా కూడా గొప్పలు పోయింది. అసలు వర్మ ఎప్పుడు ఏ సినిమా తీస్తున్నాడో నిజంగానే ఎవ్వరికీ అర్ధంకావట్లేదు.