ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత తన కొత్త సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత వీళ్ల కాంబోలో రాబోయే ఈ సినిమాను.. రామ్ హోమ్ బ్యానర్ ‘స్రవంతి మూవీస్’లో, అన్నయ్య కృష్ణ పోతినేని  సమర్పణలో, స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇది రామ్ కు 18వ సినిమా ఇది.

 ఈ సినిమాకు ‘రెడ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్, గుబురు గెడ్డంతో రామ్ రగ్డ్ లుక్‌ ఆకట్టుకుంటోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ లో డిఫరెంట్ లుక్‌లో కనిపించిన రామ్.. ‘రెడ్’ కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరిగినట్లు సమాచారం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఆంధ్రలో ఈ సినిమా థియేటర్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే సీడెడ్ ను 4 కోట్లకు అమ్మారు. ఇక నైజాం, వైజాగ్, కృష్ణలో శ్రీ స్రవంతి మూవీసే సొంతంగా రిలీజ్ చేసుకుంటుంది.

ఇదో తమిళ చిత్రం రీమేక్ . కిషోర్, రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు మార్పులు, చేర్పులతో ఇంట్రెస్టింగ్ స్టోరీ రెడీ చేశాడని సమాచారం.అలాగే సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.

 ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
 రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం : ’మెలోడిబ్రహ్మ’ మణిశర్మ, కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : జునైద్, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్.