Asianet News TeluguAsianet News Telugu

దూసుకెళ్తున్న రామ్ పోతినేని ‘బుల్లెట్’.. రికార్డు స్థాయిలో వ్యూస్..

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), కృతి శెట్టి జంటగా వస్తున్న చిత్రం ‘ది వారియర్’. ఈ మూవీ సాంగ్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ‘ది బుల్లెట్’ దూసుకెళ్తోంది.
 

Ram Pothineni Bullet Song is Trending and Reached Record level views
Author
Hyderabad, First Published Jun 25, 2022, 4:47 PM IST

స్టార్ హీరోల సినిమాలంటే కథతో పాటు.. మంచి మ్యూజిక్ ను కూడా ఆశిస్తుంటారు ఆడియెన్స్. గత కొద్దిరోజులుగా సౌత్ నుంచి వస్తున్న భారీ చిత్రాలు ఇప్పటికే అదిరిపోయే మ్యూజిక్ ట్రాక్స్ తో ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.తాజాగా టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రం ‘ది వారియర్’ (The Warrior) నుంచి వచ్చిన సాంగ్స్ కూడా దుమ్ములేపుతున్నాయి. 

‘ది వారియర్’ చిత్రంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందుకు తన మేకర్ ఓవర్ ను కూడా అదిరిపోయేలా మార్చేశాడు. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నట్టు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరోవైపు రామ్ కూడా మరింత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. తమిళ మాస్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో The Warrior తెరకెక్కిస్తున్నారు. రామ్ సరసన యంగ్ హీరోయిన్  కృతి శెట్టి (Krithi Shetty) కూడా మరింత జోష్ గా నటించింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. 

అయితే ఏప్రిల్ 22న ది వారియర్ నుంచి వచ్చిన ‘ది బుల్లెట్’ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంటోందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు మాస్ సాంగ్ తెలుగు, తమిళంలో కలిసి 125 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా ట్రెండింగ్ లోనే ఉండి రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ కు  దేవీ శ్రీ ప్రసాద్ క్యాచీ టూన్ అందించగా.. తమిళ యాక్టర్ శింబు (Simbu), హరిప్రియ అద్భుతంగా పాడారు. శ్రీ మణి ఈ సాంగ్ కు అదిరిపోయే లిరిక్స్ అందించారు. అలాగే ఇటీవల వచ్చిన ‘దడ దడ’, ‘విజిల్’ సాంగ్స్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

ఇస్మార్ట్ శంకర్ తర్వాత అలాంటి చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వస్తున్నచిత్రం ‘ది వారియర్’. ఈ చిత్రంలో తొలిసారిగా రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండటంతో ఇస్మార్ట్ శంకర్ పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అదే స్థాయి హైప్ కొనసాగుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. జులై 14న వరల్డ్ వైడ్ ‘ది వారియర్’ రిలీజ్ కానుంది. చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios