Asianet News TeluguAsianet News Telugu

వర్మ ‘డి కంపెనీ’ రివ్యూ

 స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ రోజు చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది. ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యిందా వంటి విషయాలు చూద్దాం. 

Ram Gopal Varmas D Company review jsp
Author
Hyderabad, First Published May 15, 2021, 6:14 PM IST

అండర్ వరల్డ్ సినిమాలంటే అందరికీ ముందుగా గుర్చొచ్చేది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ‘సత్య’ ‘కంపెనీ’ వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించాడు వర్మ. ఇప్పుడు ముంబైకి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘డి-కంపెనీ’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  పోస్టర్,ట్రైలర్స్ విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసిన వర్మ.. ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ బాగానే క్రియేట్ చేసారు. స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ రోజు చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది. ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యిందా వంటి విషయాలు చూద్దాం. 
 
కథేంటి

‘డీ కంపెనీ’ సినిమాలో ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌ గా అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎలా ఎలా ఎదిగాడన్నది ఇందులో చూపించటమే ప్రధాన కథగా సాగుతుంది. ఈ సిరీస్ లో 1993 ముంబై బాంబు పేలుళ్ల గురించి.. డి-కంపెనీ నీడలో బ్రతికిన ఇతర గ్యాంగ్‌ స్టర్ల గురించి చెప్పుకొచ్చారు. కానిస్టేబుల్ కొడుకులైన దావూద్ ఇబ్రహీం (అశ్వంత్ కాంత్), సాబీర్ (రుద్ర కాంత్) ఇద్దరూ దారి తప్పి.. ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ ఎలా ఎదిగారు ? గ్యాంగ్ వార్స్ కారణంగా వీళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? అనేది ఈ సినిమాలో చూపించారు. అలాగే ఈ మధ్యలో దావూద్ ప్రేమించిన సుజాత ( నైనా గంగూలీ)తో అతని లవ్ స్టోరీ సైతం కనపడుతుంది. అసలు ముంబైలో దావూద్ ఇబ్రహీం సొంతంగా దావూద్ గ్యాంగ్ ను ఎలా ఏర్పరిచాడు ? తన అన్న సాబీర్ ను చంపిన వారి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు ? అనేది మొదటి పార్ట్ కథ గా నడిచింది. 

ఎలా ఉంది..

‘డీ కంపెనీ’ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాలన్నింటికి మదర్‌ లాంటిదని.. ఇది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. అందుకే ‘డీ కంపెనీ’ సిరీస్ ని మహా భారతంతో పోలుస్తూ దీనికి ‘మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్’ అని క్యాప్షన్‌ పెట్టాడు. అయితే ఈ సినిమాలో అంత సీన్ కనపడదు. ఒక వీధి ముఠాను భయంకరమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ గా దావూద్‌ ఎలా మార్చారనేదే ‘డీ కంపెనీ’ లో చూపెడతారని ఎక్సపెక్ట్ చేస్తాం. అయితే మనం ఊహించే స్దాయిలో సగం కూడా  ఆ ఇంపాక్ట్ సినిమాలో ఇవ్వ లేదు.  ‘డి కంపెనీ- పార్ట్ 1’లో మెయిన్ క్యారక్టర్ చాలా వరకు సంఘటనలకు స్పందిస్తుందే తప్ప తనకంటూ ఓ నిర్ణయం తీసుకోదు. ఒక్క క్లైమాక్స్ సీన్ లో మాత్రమే కాస్త తన ఉనికిని చాటుకుంటుంది. ప్రధాన పాత్రే ఇంత డల్ గా ఉంటే ఇక ఉత్సాహం ఎక్కడొస్తుంది? దావూద్ ఇలా ఎదిగాడా అని డౌట్ వస్తుంది. వర్మ గత చిత్రాల మాదిరిగానే ఏదో చూపెడతానని ఆశ పెట్టి చివరకు నిరాశ పరుస్తాడు. అందుకు కారణం స్క్రిప్టు సమస్యలే అని అర్దమవుతుంది. కాన్సెప్టు ని పబ్లిసిటీ చేసుకున్నంత శ్రద్ద సినిమాపై పెట్టలేదని అర్దమవుతుంది. 
 

టెక్నికల్ గా ...

ఎత్తుకున్న స్టోరీ లైన్ కి తగ్గ ట్రీట్మెంట్ ఈ కథకు సెట్ కాలేదనిపిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బోర్ కొట్టిస్తుంది. అయితే వర్మ గత సినిమాల్లో లాగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది.  సినిమాలోని చాలా సీన్స్ ని వర్మ మనస్సు పెట్టిచేసారు. ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న లెంగ్త్ తగ్గించాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  అయితే నలభై ఏళ్ళ క్రితం ముంబై ఎలా ఉండేదో, దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ లో తక్కువ కాలంలోనే లీడర్ గా ఎలా ఎదిగాడు అనేది కొంతవరకూ బాగానే చూపించాడు రామ్ గోపాల్ వర్మ. అయితే అండర్ వరల్డ్ సీన్స్ కూడా రొటీన్ వ్యవహారంతోనే సాగడం విసిగిస్తాయి.  గ్యాంగ్స్ చేసే పనులు కూడా చూస్తూంటే ఇలా నిజ జీవితంలో గ్యాంగ్ లు ఉంటాయా అనే డౌట్ వచ్చేంత   సినిమాటిక్ గా అనిపిస్తాయి. 

ఫైనల్ థాట్

 ‘డి కంపెనీ’ కాదు..ఇది  ‘వర్మ కంపెనీ’ . ఓటీటి పేరులో ఉన్న స్పార్క్ ...సినిమాలో మిస్సైంది
Rating:2


ఎవరెవరు
నటీనటులు : అశ్వత్ కాంత్-నైనా గంగూలీ-రుద్ర్ కాంత్-ఐరా మోర్-అభిలాష్ చౌదరి-హేరంబ్ త్రిపాఠి-వినోద్ ఆనంద్-రాకీ మహాజన్ తదితరులు
సంగీతం : పాల్ ప్రవీణ్
సినిమాటోగ్రఫీ : మల్హర్ భట్ జోషి
 దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత‌ : సాగర్ మాచనూరు
ఓటీటి :  స్పార్క్  
విడుదల తేదీ: మే 15, 2021

Follow Us:
Download App:
  • android
  • ios