Asianet News TeluguAsianet News Telugu

వర్మ మార్క్‌ `మర్డర్‌`.. కుటుంబ కథా చిత్రమ్

లాక్ డౌన్‌ సమయంలో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ హల్‌ చల్‌ చేస్తున్న వర్మ తాజాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఏటీటీలో కాకుండా, ఓటీటీ ప్లాట్‌ ఫాంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వర్మ ఇటీవల ప్రకటించాడు.

Ram Gopal Varma Murder Movie Trailer
Author
Hyderabad, First Published Jul 28, 2020, 9:18 AM IST

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న తాజా చిత్రం మర్డర్‌. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య ప్రణయ్‌ హత్యోదంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. ప్రణయ్‌ హత్య ఆ తరువాత ప్రణయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృతకు ఎదురైన అనుభవాలను, ప్రణయ్‌ హత్యకు దారి తీసిన సంఘటనలు, ఈ నేపథ్యంలో అమృత తండ్రి మానసిక సంఘర్షణ ఇలా అనే కోణాలను తన సినిమాలో ఆవిష్కరించనున్నాడు వర్మ.

లాక్ డౌన్‌ సమయంలో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ హల్‌ చల్‌ చేస్తున్న వర్మ తాజాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఏటీటీలో కాకుండా, ఓటీటీ ప్లాట్‌ ఫాంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వర్మ ఇటీవల ప్రకటించాడు. తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్‌తో మరోసారి తన మార్క్‌ చూపించాడు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వర్మ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి డైలాగ్స్‌ లేకపోయినా దాదాపు సినిమా కథ అంతా ట్రైలర్‌లోనే రివీల్ చేశాడు వర్మ. ట్రైలర్‌తో సమాజానికి చాలా ప్రశ్నలను సందించాడు వర్మ.

ఈ సినిమాను నట్టి ఎంటర్‌టైన్మెంట్స్‌, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్‌, అనురాగ్‌ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ప్రణయ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. వర్మ తెరకెక్కించే సినిమా కారణంగా ప్రణయ్‌ హత్య కేసు విచారణ ప్రభావితం అయ్యే అవకాశం ఉందని బాలస్వామి ఆరోపిస్తున్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, చిత్రయూనిట్ మీద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios