ఏపీలో ఎన్నికల నేపధ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈసారి బరిలో రాజకీయ నాయకులతో పాటు సినిమా వాళ్లు కూడా ఉండడం మరింత ఇంటరెస్టింగ్ గా మారింది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో చంద్రబాబుని ఒత్తిడికి గురి చేస్తున్నారు.

తన సినిమాలో చంద్రబాబుని నెగెటివ్ యాంగిల్ లో చూపిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నో వివాదాల తరువాత ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమైంది. మరోపక్క మోహన్ బాబు ఫీజురీయింబర్స్ మెంట్ విషయంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా మారారు.

స్టూడెంట్స్ తో కలిసి బాబుని ఏకిపారేస్తున్నారు. ఇలా వీరిద్దరూ చంద్రబాబుకి యాంటీగా తయారయ్యారు. అటువంటిది వీరిద్దరూ కలిసి భేటీ అయితే ఎలా ఉంటుంది చెప్పండి.. ఇక వారికి హాట్ టాపిక్ అంటే చంద్రబాబే కదా..! ఇప్పుడు కూడా అదే జరిగింది.

మోహన్ బాబుని కలిసిన ఆర్జీవీ ఫోటోని షేర్ చేస్తూ.. 'చంద్రబాబు ఇలా అని నేను ఎప్పుడూ అనుకోలేదు' అంటూ కోపం, ఆశ్చర్యంతో ఉన్న ఎమోజీలను పోస్ట్ చేస్తూ.. 'f...k, b...d' అనే బూతు పదాలను వాడారు. మరి నిజంగానే వర్మ.. మోహన్ బాబుని కలిశారా..? లేక పాత ఫోటోలతో పబ్లిసిటీ చేసుకుంటున్నారో తెలియాల్సివుంది!